Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. టిడిపి, జనసేన, బిజెపి నుంచి చాలామంది ఆశావాహులు ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా లిస్టులో ఐదుగురు ప్రముఖంగా వినపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా వినపడుతున్న పేరు వంగవీటి రాధ. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని స్వయంగా నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

Also Read : ఏపీ వద్దు.. యానం ముద్దు..!

గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా వంగవీటి రాధకు నారా లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారట. ఇక పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు ప్రముఖంగా వినపడుతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. దీనితో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనితో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. ఇక మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేరు కూడా వినపడుతోంది. అలాగే జనసేన పార్టీ నుంచి నాగబాబు పేరు ప్రధానంగా చర్చల్లో ఉంది.

Also Read : తెలుగోళ్ళ తమిళ పిచ్చి.. ఆ డైరెక్టర్ల వెంట పడుతున్నారా…?

నాగబాబును ఎమ్మెల్సీ చేసీ కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నాగబాబు ఇప్పటికే క్యాబినెట్ లోకి అడుగుపెడతారని తెలుగుదేశం పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ చేయడం దాదాపు ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇక బిజెపి నుంచి మాధవ్ పేరు కూడా వినపడుతోంది. ఇలా ఐదుగురు నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ముఖ్యంగా వంగవీటి రాధా, నాగబాబు పేర్లు దాదాపుగా ఖరారు అయినట్లుగానే కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్