టీడీపీ ప్రభుత్వం వచ్చిందంటే చాలు.. చంద్రబాబుకు సహకారం ఉండదు అనే మాట మనం పదే పదే వింటూ ఉంటాం. మంత్రుల నుంచి పార్టీ నాయకుల వరకు అసలు ఎవరూ మీడియా ముందుకు వచ్చి రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే ప్రయత్నం చేయరు అనేది ప్రధాన విమర్శ. కార్యకర్తలు ఎన్నో సందర్భాల్లో దీనిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వివేకానంద రెడ్డి మరణం, తుని రైలు ఘటన, జగన్ పై దాడి వంటి వాటి విషయంలో మౌనంగా ఉండిపోయింది టీడీపీ.
Also Read : తీరు మారలేదు.. కారణం ఇదేనా..!
కాని ఇప్పుడు మాత్రం దూకుడు పెంచారు. ఇటీవల జగన్ పై విమర్శలు చేసే విషయంలో వెనకడుగు వేయడం లేదు. సింగయ్య వ్యవహారంలో చాలా మంది నేతలు ముందుకు వచ్చారు. ఆ జిల్లా వాళ్ళు మినహా దాదాపుగా అందరు నేతలు మాట్లాడారు. రెండు రోజుల క్రితం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత ఆరోపణలు చేసారు. వీటిపై సామాన్య ప్రజల్లో పెద్ద చర్చ జరిగింది. దీనిపై మంత్రులు, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అందరూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Also Read : మద్యం కోసం వైసీపీ నేతల హడావుడి.. జగన్ టూర్ లో ఇంట్రస్టింగ్ సీన్స్
లేటెస్ట్ గా జగన్ చిత్తూరు జిల్లా పర్యటనపై కూడా ఇదే స్థాయిలో స్పందన వచ్చిందనే చెప్పాలి. జగన్ టూర్ ఫేక్ అని చెప్పడంలో కూటమి సక్సెస్ అయింది. మంత్రులు అచ్చేన్నాయుడు, అనగాని, నాదెండ్ల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా కామెంట్స్ చేసారు. దీనిని టీడీపీ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా బాగా వాడుకుంది. అందుకే వైసీపీ పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఇక జగన్ పొదిలి పర్యటన సందర్భంగా కూడా కూటమి నేతల ఘాటు రియాక్షన్ లు ఆ పార్టీల కార్యకర్తలను మెప్పించాయి.