Wednesday, February 4, 2026 07:38 PM
Wednesday, February 4, 2026 07:38 PM

ఆ విషయంలో మీరంతా దండగ..!

తెలుగుదేశం పార్టీ నేతల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. అసలు మీరంతా ఏం చేస్తున్నారు.. ఎందుకున్నారు.. ఇవే ప్రశ్నలు ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సొంత పార్టీలో సీనియర్ నేతలకు వేసిన ప్రశ్నలు. నిజానికి పార్టీ నేతలను లోకేష్ చాలా ఆలస్యంగా ప్రశ్నించారనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన పలు అంశాలే కారణమంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. కొంతమంది నేతల తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సొంత వ్యాపారాల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారనే ఆరోపణలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే.. కఠిన చర్యలు తప్పవని ఓ వైపు అధినేత చంద్రబాబు ఎన్నిసార్ల హెచ్చరించినా కూడా.. పార్టీలో కొందరు ముఖ్యనేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొందరు నేతల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Also Read : కొత్త జిల్లాలు.. నియోజకవర్గాలు ఫైనల్..!

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలు.. కిందిస్థాయి కార్యకర్త వరకు అంతా ఇబ్బందులు పడిన వారే. అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచింది. నిజానికి ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలంతా నిరసనలు తెలియజేశారు. ఒకరకంగా వైసీపీ ఓటమికి ఇదే కారణం కూడా. అదే సమయంలో చంద్రబాబుపై కొందరు నేతలు నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిలో ఇప్పుడు చాలామంది సైలెంట్ అయిపోయారు. జోగి రమేష్ వంటి ఒకరిద్దరు మాత్రం.. ఇప్పటికీ జగన్ మెప్పు కోసం నోటికి పని చెబుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన జోగి రమేష్.. అరెస్టు భయంతోనే ముందస్తుగా బీసీ కార్డు తీశారు. గౌడ కులానికి చెందిన సామాన్య జోగి రమేష్.. అంటూ కులం కార్డులో రాజకీయాలకు తెర లేపారు. అయినా సరే చట్టం మాత్రం.. తన పని తాను చేసుకుంటూ పోయింది.

Also Read : జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో..?

జోగి అరెస్టు సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైన, లోకేష్ పైన విమర్శలు చేశారు. కులాల కుంపట్లు రాజేసేందుకు నానా యాగి చేశారు. ఈ విషయంపైనే నారా లోకేష్ పార్టీలో కొందరు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా జోగి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వంటి నేతల తీరును తప్పబట్టారు. కులం కార్డు తీసిన జోగి రమేష్‌తో మీకేం సంబంధం అని ప్రస్తావించారు. జోగి కుటుంబంతో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించడం పై అసహనం వ్యక్తం చేశారు. పైగా అధినేతపైనే జోగి విమర్శలు చేస్తుంటే.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జోగి తీరులో మార్పు రాలేదంటే.. దానికి టీడీపీ నేతలు ఇచ్చిన అలుసే కారణమన్నారు. పదవులు కావాలి.. కానీ పార్టీ మేలు మీకు అవసరం లేదా.. అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి కుటుంబం పదే పదే కులం కార్డు తీస్తుంటే.. టీడీపీలో బీసీ నేతలు మాత్రం.. సైలెంట్‌గా ఉండటం ఏమిటని నిలదీశారు. ప్రతి విషయానికి చంద్రబాబు, లోకేష్ స్పందించాలా.. అని అసహనం వ్యక్తం చేశారు లోకేష్. మంత్రిగా ఉన్న సమయంలో జోగి చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసని.. అయినా సరే.. వాటిని మరోసారి రుజువు చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలపైనే ఉందన్నారు. పార్టీ నిర్ణయమే ప్రతి ఒక్కరికీ ఫైనల్ అని చెప్పిన లోకేష్.. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్