ఆదాయపు పన్ను దాఖలు విషయంలో సంబంధిత శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే , జరిమానాలు లేకుండా దాఖలు చేసేందుకు చివరి అవకాశం నేటితో ముగుస్తోందని ప్రకటించింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లు, ఆడిట్ అవసరం లేని చిన్న వ్యాపారాలకు గడువు సోమవారం వరకు మాత్రమే ఉంది. గతంలో, పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ సమయం ఇచ్చేందుకు జూలై 31 నుండి నేటి వరకు పొడిగించారు.
Also Read : యూరియా వాడితే క్యాన్సర్.. చంద్రబాబు సంచలన కామెంట్స్
ఇప్పుడు, ఆ గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు గడువు తేదీలోగా తమ ఐటీఆర్‌ను దాఖలు చేయకపోతే.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ఆలస్యమైన రిటర్న్‌లను డిసెంబర్ 31 వరకు దాఖలు చేయవచ్చు. కాకపోతే జరిమానా కట్టాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, ఆలస్యంగా దాఖలు చేసేవారు జరిమానా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే, జరిమానా రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : ఇండియా వర్సెస్ పాక్.. సూర్య కుమార్ సంచలన కామెంట్స్
రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు, జరిమానా రూ.5,000 చెల్లించాలి. పన్ను చెల్లించాల్సి ఉంటే దానికి దానికి వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 234 ఏ ప్రకారం ఒక శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపు ఆలస్యం అయితే ఏదైనా రిఫండ్ వస్తే అది కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, రిటర్న్ దాఖలు చేయడం ఆలస్యం అయితే.. తగ్గింపులు లేదా మినహాయింపులు కోల్పోయే అవకాశం ఉంటుంది.