టీమిండియా వెటరన్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెడీ అయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆస్ట్రేలియా టూర్ లో వీళ్ళిద్దరూ ఘోరంగా ప్లాప్ అయ్యారు. ప్రధానంగా రోహిత్ శర్మ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కీలక మ్యాచ్ లలో రోహిత్ శర్మ చేతులెత్తేయడం పై ఎన్నో విమర్శలు వచ్చాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలి అనే డిమాండ్ కూడా వినపడింది.
Also Read : ఆస్ట్రేలియాపై పంత్ వైలెంట్ రివెంజ్
అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీకి భారత క్రికెట్ టీం రెడీ అవ్వబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీ కన్ఫర్మ్ కూడా చేసేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సీరిస్ కు రోహిత్ శర్మను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ సారధ్యంలోనే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడనున్నారు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు కీలకమైన వన్డే సీరిస్ పై భారత్ ఫోకస్ పెట్టింది. ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అందరూ భావించారు కానీ.. రోహిత్ శర్మని కంటిన్యూ చేయాలని బోర్డ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : రోహిత్ కు షాక్ ఇచ్చిన ముంబై
ఇక సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో కూడా ఆందోళన ఉంది. ఆసిస్ పై తన స్థాయి ఆట తీరును విరాట్ కోహ్లీ ప్రదర్శించలేదు. దీనితో విరాట్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. అయితే వన్డే ఫార్మేట్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి మాత్రం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి కూడా అవకాశం ఇవ్వడం కాయంగా కనబడుతోంది. ఇక గత వన్డే ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డ్ సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్ ను పక్కన పెడితే కోహ్లీ ఆటపై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచే ఛాన్స్ ఉంది.