వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు. బూతులు మాట్లాడకపోయినా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం అప్పట్లో కాస్త సంచలనం అనే చెప్పాలి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. జగన్ పై తమకున్న భక్తుని చాటుకునే విషయంలో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు కనపడుతున్న సరే ఆయనను అరెస్టు చేసే విషయంలో మాత్రం ముందడుగు పడటం లేదు.
Also Read : విమాన ప్రమాదానికి కారణం అదేనా..?
అయితే ఇటీవల ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం నియోజకవర్గంలో చెరువులతో పాటుగా స్మశానాలు ఉన్న భూముల సర్వే నెంబర్లతో దాదాపు పదివేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనిపై టిడిపి నేతలు అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తన కొడుకుని గెలిపించడానికి జగన్ ఫోటోతో ఉన్న పట్టాలను ఓ మాజీ ఎమ్మార్వో తో సంతకం చేయించి నాని పంచిపెట్టారు. ఆ భూములకు చట్టబద్ధత లేకపోయినా సరే ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లుగా ప్రచారం కూడా చేసుకున్నారు.
Also Read : తన లక్కీ నెంబరే తన చివరి రోజు.. విజయ్ రూపాని విషాదం
ఈ వ్యవహారంలో ఇప్పుడు నానిని ఆయన కుమారుడు కిట్టును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వచ్చేవారం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. దీనితోపాటుగా మెడికల్ కాలేజీ భూముల కొనుగోలు విషయంలో ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాని పాపం పండిందని వాళ్ళిద్దర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవీంద్ర స్పష్టం చేశారు. 2023లో బదిలీ అయిన ఎమ్మార్వో తో 2024లో సంతకాలు ఏ విధంగా చేయించారని ఆయన ప్రశ్నించారు.




