Saturday, September 13, 2025 08:45 AM
Saturday, September 13, 2025 08:45 AM
roots

నా సమస్య నేనే సరిదిద్దుకుండా.. కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది తిరువూరు పంచాయితీ. వరుస ఫిర్యాదులతో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ను పిలిపించిన అధిష్టానం… ఆయనతో పలు కీలక విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తిరువూరు పరిణామాలపై ఎమ్మెల్యే కొలికిపూడిని వివరణ కోరింది. కొలికిపూడి శ్రీనివాస్‌తో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశం అయి పలు విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ ఎంపీ కేశినేని శివనాథ్‌, వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణరాజు కూడా పాల్గోన్నారు.

అయితే పలు కీలక విషయాలపై కొలికపూడి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫైవ్ మెన్ కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్ తన సమాధానాలు ఇచ్చారట. నేనేం తప్పు చేయలేదు, ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్న కోలికపూడి… నావల్ల పార్టీకి ఇబ్బందులు వస్తే సరిదిద్దుకుంటానని సమాధానం ఇచ్చారట. రేపు మధ్యాహ్నం తిరువూరు లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారట కొలికపూడి. ఆ సమావేశానికి ఎంపీ చిన్ని, వర్ల రామయ్య లు హాజరుకావాలని పార్టీ ఆదేశించింది.

Read Also : అప్పుడు పొగిడారు… ఇప్పుడు ఏమయ్యారు…?

ఇక కొలికపూడి విషయంలో మీడియా ప్రతినిధులు కూడా చంద్రబాబుకి ఫిర్యాదు చేయడం సంచలనం అయింది. అలాగే మహిళలకు కూడా కొలికపూడి అసభ్యంగా మెసేజ్ లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై కూడా కొలికపూడిని పార్టీ అధిష్టానం సమాధానం అడిగిందట. అది కేవలం తప్పుడు ఆరోపణ మాత్రమే అని కావాలంటే సాక్ష్యాలు చూపించమని వారిని కోరండి అంటూ కొలికపూడి సమాధానం ఇచ్చారట. అయితే కొలికపూడి సమాధానాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే దూకుడు తగ్గించుకోవాలని సూచించారట నేతలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్