Saturday, September 13, 2025 04:17 AM
Saturday, September 13, 2025 04:17 AM
roots

ఆ విషయంలో జగన్, కేసీఆర్ ఒకటే..!

పదవిలో ఉన్నప్పుడు దాదాపు ఒకేలా వ్యవహరించిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు.. ఓడిన తర్వాత కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. ఓడిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఎన్నికల ముందు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అని గొప్పగా ప్రకటించారు కేసీఆర్. గెలిచిన తర్వాత పదేళ్ల పాటు ఆయనే సీఎం కుర్చీలో కూర్చుని పెత్తనం చేశారు. జగన్ కూడా అంతే. “నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నా. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాబట్టి ఏపీ రాజధాని అమరావతి” అంటూ గొప్పగా ప్రకటించారు జగన్. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అంటూ విచిత్రమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొని వచ్చారు. దీంతో ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రం అంటూ ఏపీ మిగిలిపోయింది. దీంతో ఎన్నికల ముందు ఒకమాట, తర్వాత ఒకలా ఇద్దరు నేతలు వ్యవహరించారనే మాట తేలిపోయింది. ఇక ఈ ఇద్దరు ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు మాజీలు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు భయపడుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీకి వచ్చేందుకు ఇద్దరు నేతలు సుముఖత చూపటం లేదు. ఇక అసెంబ్లీకి వచ్చే విషయంలో కూడా ఈ ఇద్దరు ఒకేలా వ్యవహరిస్తున్నారు.

Also Read : రేవంత్ బీజేపీలోకి వచ్చెయ్.. ఎంపీ సంచలన కామెంట్స్

అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు.. నా మాటే శాసనం అనేలా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పెత్తనం చేశారు. అధికార దర్పంతో సామాన్యులను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవలేదు. ఏ విషయం అయినా సరే నెంబర్ టూ నేతలే పరిక్షించారు తప్ప.. ఇద్దరు మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ లు మంత్రులను కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓడిన తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చే విషయంలో కూడా ఇద్దరు ఒకటే అని మరోసారి రుజువైంది. ఇద్దరు నేతలు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. వస్తే తమ హయాంలో జరిగిన తప్పులు ఎత్తి చూపితే వాటికి జవాబు చెప్పాల్సి వస్తుందని కంగారు పడుతున్నారు.

Also Read : ఒక్క వీడియోతో లోకేష్ ఆన్సర్ ఇచ్చేసారా..?

అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తారనే విషయం ఇద్దరు నేతలకు తెలుసు. ఇలా వేటు నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు ఒకేలా ఆలోచించారు. సభలో సభ్యులకు మాట్లాడే అవకాశం లేని రోజున సభకు వస్తున్నారు. 2023లో ఓడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో బడ్జెట్ ప్రవేశపెట్టే మొదటి రోజు సభకు వచ్చారు కేసీఆర్. మళ్లీ ఏడాది తర్వాత ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం రోజే సభకు వస్తున్నారు. ఇదే సేఫ్ అని జగన్ కూడా భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే సభకు వచ్చిన జగన్.. ఆ తర్వాత 5 రోజులకు ప్రెస్ మీట్ పెట్టారు. అంతే తప్ప.. సభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఏ మాత్రం ముందుకు రాలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్