Friday, September 12, 2025 05:00 PM
Friday, September 12, 2025 05:00 PM
roots

కర్ణాటకకు పాకిన ఫోన్ ట్యాపింగ్.. భయంతోనే వాళ్ళ ఫోన్లు కూడా..?

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులు మొదలుకుని.. సినిమా వాళ్ళ వరకు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలను సిట్ సేకరించడం, ఒక్కొక్కరిని విచారణకు పిలవడం కలకలం రేపుతోంది. హీరోయిన్ల ఫోన్లు, జర్నలిస్ట్ ల ఫోన్ లు కూడా ట్యాప్ కావడంతో వారిని విచారిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారి ఫోన్ లు ట్యాప్ అయ్యాయి అనే ప్రచారం సైతం జరిగింది. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read : మరో ఇద్దరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్..?

కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ కీలక నేతల ఫోన్ లు కొన్ని ట్యాప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లను టార్గెట్ చేసినట్టు సమాచారం. వీరిలో కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేతల పేర్లే ప్రముఖంగా వినపడుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే ప్రయత్నం చేసిన నాయకుల అందరి ఫోన్ లు ట్యాప్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఫోన్ లు ట్యాప్ అయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది.

Also Read : ఆ విషయంలో జగన్ భయపడుతున్నారా..?

కర్ణాటక, తెలంగాణా ఎన్నికల్లో సునీల్ టీం పని చేసింది. ఇక కర్ణాటక నాయకులు తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డారు. అందులో డీకే శివకుమార్, దినేష్ గుండూరావు, కేసీ వేణు గోపాల్ సహా పలువురు నేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసారు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వారిని కూడా సిట్ విచారిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్