ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఏ 1 అద్దేపల్లి జనార్దన్ రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా స్థానికంగా ఉండే బార్లు, వైన్ షాపులకు అక్రమంగా రవాణా చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికా పారిపోయిన జనార్దన్ రావు.. అనూహ్యంగా తిరిగి రాష్ట్రానికి రావడం, అరెస్ట్ కావడం, ఆ తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర గురించి సంచలన విషయాలు బయటపెట్టడం.. రాజకీయ పార్టీలను కుదుపేస్తోంది.
Also Read : ఎమ్మెల్యే తీరుపై క్యాడర్ ఫుల్ ఫైర్..!
మూడు కోట్ల రూపాయలకు ఆశపడి తాను జోగి రమేష్ చెప్పినట్లు చేశాను అంటూ జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేయడం సంచలనమైంది. ఈ కేసులో తన తమ్ముడుని కూడా ఇరికించారని, జోగి రమేష్ మద్యం తయారీ చేయించడమే కాకుండా, పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించారంటూ.. జనార్దన్ రావు తన వీడియోలో కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు జనార్దన్ రావు ఫోన్ లో వాట్సాప్ చాటింగ్ ను అధికారులు గుర్తించారు. జనార్దన్ రావు తో జోగి రమేష్ చేసిన సంభాషణలపై దృష్టి పెట్టిన అధికారులు.. జనార్దన్ రావు ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు.
Also Read : జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత.. తనను జనార్దన్ రావు కలవాలని వాట్సాప్ లో మెసేజ్ చేశారు జోగి రమేష్. అలాగే ఫేస్ టైం లో కాల్ చేయాలని.. ఆఫ్రికా ఎప్పుడు వెళుతున్నావని జోగి రమేష్ ఆరా తీశారు. అలాగే తనకు ఫోన్ చేయాలని, తాను చెప్పిన ప్రదేశానికి రావాలి అంటూ కూడా వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ సంభాషణ జరిగింది. దీనితో జోగి రమేష్ పై జనార్దన్ రావు చేసిన ఆరోపణలకు ఈ చాటింగ్ బలం చేకూర్చినట్లు అయింది. దీనితో జోగి రమేష్ ను పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.