వైసీపీ మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాల విషయంలో సర్కార్ ఒక్కొక్కటి బయటకు లాగుతోంది. తమకు ఇబ్బంది లేదని నమ్మకంగా ఉన్న వారిని అరెస్ట్ లు చేయడానికి రంగం సిద్దం చేస్తోంది. లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు వైసీపీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు మరో నాయకుడి అవినీతి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ పక్కా ఆధారాలతో దొరికిపోయినట్టు సమాచారం.
Also Read : రాఖీ పండుగ ప్రత్యేకత.. పాటించాల్సిన నియమాలు ఇవే..!
ఆయన తనయుడు, సోదరుడిని తెరపై పెట్టి రాష్ట్ర హోం డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించు కోవటంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన విషయంలో పక్కా ఆధారాలు సేకరించారు. రెవెన్యూ, ఏసీబీశాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక సీఐడీ అధికారుల వద్దకు చేరినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలనలో కొన్ని కీలక ఆధారాలను గుర్తించారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణకు సంబంధించిన సమగ్ర రిపోర్టును ఏసీబీకి, సీఐడీకి అందించారు.
Also Read : ఏపీ అడ్వకేట్ జనరల్ కు వైసీపీ లంచం.. లాయర్ సంచలన కామెంట్స్
జోగి రమేష్ తనయుడు, సోదరుడు పేరిట రిజిస్ర్టేషన్ చేయించుకుని, వేరేవారికి విక్రయించటం చెల్లుబాటు కాదని రెవెన్యూ, ఏసీబీ జాయింట్ కమిటీ స్పష్టం చేసింది. ఆ భూములు ముమ్మాటికీ అగ్రిగోల్డ్ వని పేర్కొంది. మొత్తం 11 పేజీలతో కూడిన సమగ్ర నివేదిక ఈ భూములకు సంబంధించిన వాస్తవాలు ఏమిటన్నది తహసీల్దార్ సుగుణ నివేదికలో స్పష్టంగా వివరించారు. అంబాపురం గ్రామం ఆర్ ఎస్ నెంబర్ 87లోని 2293.05 చదరపు గజాల భూమిని పెద పాడు పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 3/2015 ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 133, 117లను అనుసరించి రాష్ట్ర హోం డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.




