Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

సజ్జలకు జగన్ బిగ్ షాక్.. మరో రెడ్డికి అగ్ర తాంబూలం

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఇప్పటినుంచే వైసీపీ నానా కష్టాలు పడుతోంది. పార్టీలో కీలక మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కసరత్తులు చేస్తున్నారు. సమర్థవంతంగా లేని నాయకులను పార్టీ బాధ్యతలు నుంచి తప్పించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని పూర్తిగా బ్రష్టు పట్టించిన వారిలో ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. జగన్ కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ మీద ప్రభుత్వం మీద ఎక్కువగా పట్టు ఉండేది.

Also Read : మోడీ రష్యా టూర్.. ఇంట్రెస్టింగ్ గా ప్రధాని పర్యటన

దీని కారణంగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా జగన్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీలో కీలక బాధ్యతలనుంచి సజ్జలను తప్పించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటివరకు పార్టీలో సమన్వయ బాధ్యతలను రామకృష్ణారెడ్డి చూస్తూ వచ్చారు. అయితే ఆయన కారణంగా పార్టీలో కీలక నేతలు దూరమవుతున్న నేపథ్యంలో ఆయన ఆ పదవిలో ఉండటం కరెక్ట్ కాదు అని జగన్ భావిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల మాట.

Also Read : HCU భూముల్లో కీలక పరిణామం, రేవంత్ కు షాక్ తప్పదా..?

ఇప్పుడు ఆ బాధ్యతలను పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. సతీష్ రెడ్డి కి సౌమ్యుడిగా కూడా పేరు ఉంది. గతంలో జగన్ పై పలుమార్లు పోటీ చేసిన సతీష్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ కీలకంగా మారారు. జగన్ పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను సతీష్ రెడ్డి చూస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. దీనితో సతీష్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగిస్తే తనకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక వివాద రహితుడుగా కూడా సతీష్ రెడ్డికి పేరు ఉంది. అయితే టిడిపి నుంచి వెళ్లిన నేత కాబట్టి ఆ పార్టీలో ఏ విధంగా స్పందన ఉంటుంది అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్