Friday, September 12, 2025 08:50 PM
Friday, September 12, 2025 08:50 PM
roots

కోహ్లీ బాటలోనే రోహిత్.. లండన్ పయనం అవుతున్నాడా..?

భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు రిటైర్మెంట్ తర్వాత తమ ఫ్యూచర్ ను లండన్ లో వెతుక్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దాలుగా భారత జట్టులో కీలకంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్ లు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. టి20 క్రికెట్ తో పాటుగా టెస్ట్ క్రికెట్ కు ఈ ఇద్దరూ గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు భారత్ లో ఉంటే అభిమానుల కారణంగా స్వేచ్చగా తిరగలేము అనే భావనలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. కోహ్లీ ఇప్పటికే దాదాపుగా లండన్ షిఫ్ట్ అయిపోయాడు.

Also Read : భారత్ కు మరో స్టీవ్ బక్నర్ తయారయ్యాడు..!

మ్యాచ్ లో ఉంటేనే భారత్ వచ్చి ఆడుతున్నాడు. లేదంటే ఎక్కువగా లండన్ లోనే గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా లండన్ షిఫ్ట్ అయిపోతున్నాడట. ఇప్పటికే లండన్ లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్న రోహిత్ శర్మ.. త్వరలోనే కుటుంబం మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. వన్డేలు కూడా ప్రస్తుతం తక్కువగానే జరుగుతున్నాయి. మరో మూడు నెలల వరకు వన్డేలు లేవు.

Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

ఇక తన పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, కాలుష్యం వంటి సమస్యలు, అభిమానుల అత్యుత్సాహం వంటివి లేకుండా ఉండాలి అంటే లండన్ లోనే ఉండటం మంచిదని రోహిత్ భావిస్తున్నాడట. అటు దేశవాళి క్రికెట్ లో కూడా రోహిత్ పెద్దగా ఆడే ప్రయత్నం చేయడం లేదు. అయితే లండన్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడాలని రోహిత్ భావిస్తున్నట్టు కూడా జాతీయ మీడియా వెల్లడించింది. రోహిత్ తో పాటుగా సూర్యకుమార్ యాదవ్ కూడా లండన్ షిఫ్ట్ అవుతున్నట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్