Friday, October 24, 2025 06:03 PM
Friday, October 24, 2025 06:03 PM
roots

అమెరికాలో ఇండియన్ మూన్ లైట్ జాబ్.. 15 ఏళ్ళు జైలు శిక్ష..!

ఐటీ ఉద్యోగాల్లో కరోనా తర్వాత ఎక్కువగా వినపడిన మాట మూన్ లైట్. అప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ఈ పదాన్ని టెక్ ఉద్యోగులు చక్కగా వాడుకున్నారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇళ్ళ వద్దనే ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ ఆదాయం పెంచుకున్నారు. రెండు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ లక్షలు గడించారు. దీనిపై భారత ఐటీ కంపెనీలు కఠినంగా వ్యవహరించడమే కాకుండా చాలా మందిని ఉద్యోగాల నుంచి తప్పించిన పరిస్థితి కూడా మనం చూసాం.

Also Read : కంపెనీ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చి.. కన్నీరు పెట్టిస్తున్న గోళ్ళ రమేష్ కుటుంబ విషాదం..!

ఇక ఇదే అమెరికాలో కూడా కంటిన్యూ అవుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ భారత సంతతి వ్యక్తి విషయంలో అక్కడి కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సమయంలో.. మరో చోట ఉద్యోగం చేసాడు 39 ఏళ్ల భారత సంతతికి చెందిన న్యూయార్క్ వాసి మెహుల్ గోస్వామి. దీనితో అమెరికా అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సంయుక్త దర్యాప్తులో, న్యూయార్క్ స్టేట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం, సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం గోస్వామి పన్నులు కూడా ఎగ్గోట్టినట్టు గుర్తించారు.

Also Read : త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులు..!

మొత్తం అతను ఇలా 40 లక్షలు సంపాదించాడు అని గుర్తించారు. గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ లో రిమోట్ మోడల్ లో ఉద్యోగం చేసాడు. వాస్తవానికి అతనికి ఇదే ప్రాధమిక ఉద్యోగం అయినప్పటికీ.. అతను మార్చి 2022 నుండి మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీ అయిన గ్లోబల్ ఫౌండ్రీస్‌కు కాంట్రాక్టర్‌గా పని చేసాడు. గోస్వామి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన సమయంలో ఒక ప్రైవేట్ యజమాని కోసం పనిచేశాడనే ఆరోపణలపై ఆయనపై దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. పన్ను ఎగ్గోగుడుతూ రెండు ఉద్యోగాలు చేస్తున్నందుకు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్ట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

పోల్స్