ఆస్కార్ అవార్డుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి భారతీయ సినిమాలో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ పెద్దగా రేసులో లేకపోయినా.. పలు సినిమాలు మాత్రం చర్చకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మరోసారి ఆస్కార్ హడావుడి మొదలైంది. తెలుగు సినిమాల నుంచి బాలీవుడ్ సినిమాల వరకు ఎన్నో సినిమాలపై ఆస్కార్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా ఆస్కార్ రేసులో నిలిచే అవకాశం కనపడుతోంది.
Also Read : ఫ్యామిలీని టచ్ చేసిన లిక్కర్ స్కామ్ విచారణ..?
బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన ‘ఐ వాంట్ టు టాక్’, అనుపమ్ ఖేర్ ‘తన్వి ది గ్రేట్’, మిథున్ చక్రవర్తి ‘ది బెంగాల్ ఫైల్స్’, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’, అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ వంటి సినిమాలు ఈ రేసులో ఉన్నాయని అవుట్ లుక్ వెల్లడించింది. వీటితో పాటుగా సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్, స్థల్, మెటా ది డాజ్లింగ్ గర్ల్, సాంబార్ బోండా సినిమాలు కూడా ఆస్కార్ రేసులో నిలవనున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఆస్కార్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది.
Also Read : మరో మెగా ఫెస్ట్‌కు ఏపీ రెడీ..!
తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అవార్డ్ వస్తే మాత్రం అది సంచలనమే. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన తర్వాత టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ దిశగా అడుగులు పెడుతున్నాయి. ఏ అంచనాలు లేకుండా వచ్చిన తెలుగు సినిమాలు కూడా ఓ రేంజ్ లో హిట్ అవుతూ టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్నాయి.