అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరుపై భారత్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పదే పదే భారత ప్రభుత్వానికి చికాకులు సృష్టిస్తూ తలనొప్పిగా మారారు. రష్యాతో భారత్ చేస్తున్న స్నేహాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని డోనాల్డ్ ట్రంప్.. పదే పదే సుంకాల పేరుతో బెదిరించడం చేస్తున్న ట్రంప్ ఇటీవల 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత భారత్.. రష్యాకు మరింత దగ్గరైంది అనే చెప్పాలి. అటు చైనా కూడా ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read : జగన్‍కు మరో సవాల్.. ఈసారైనా..!
ఈ తరుణంలో భారత విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ సంచలన కామెంట్స్ చేసారు. అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా నిర్వహిస్తున్న ఏకైక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే అని, గతంలోని అమెరికా అధ్యక్షులు అందరూ గోప్యత పాటించారని, ఇలా స్థాయిని మరిచి ప్రవర్తించలేదని అన్నారు. ట్రంప్ సుంకాల గురించి మాట్లాడుతూ, వాణిజ్యం మరియు వాణిజ్యేతర విషయాలకు ట్రంప్ సుంకాలను ఉపయోగించడం కొత్తగా ఉందని, ట్రంప్ చర్యలకు తగిన సమాధానం ఉంటుందన్నారు.
Also Read : అంతా మా వల్లే.. క్రెడిక్ కోసం పాకులాట..!
ప్రపంచం మొత్తాన్ని ట్రంప్ ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని జై శంకర్ మండిపడ్డారు. భారత్ – అమెరికా మధ్య దీనికి సంబంధించిన వాణిజ్య చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే భారత్ వ్యవహరిస్తుందని అన్నారు. చర్చలు ఆగిపోయాయి అనే మాట వాస్తవం కాదన్నారు. రైతుల ప్రయోజనాలకు తగ్గట్టుగా భారత్ వ్యవహరిస్తుందని స్పష్టం చేసారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా ఎవరూ లేరన్నారు కేంద్ర మంత్రి.