Friday, September 12, 2025 06:52 PM
Friday, September 12, 2025 06:52 PM
roots

భారత్ కు ఊహించని దెబ్బ.. మూడో టెస్ట్ లో పంత్ కష్టమే..?

రెండో టెస్ట్ గెలిచి ఊపు మీదున్న భారత జట్టుకు మూడవ టెస్ట్ తొలి రోజు ఊహించని దెబ్బ తగిలింది. జట్టు వైస్ కెప్టెన్ పంత్ చేతికి గాయం కావడం ఇప్పుడు భారత జట్టు యాజమాన్యాన్ని కంగారు పెడుతోంది. తొలి రెండు మ్యాచులలో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో ఊపు మీదున్న పంత్.. మొదటి రోజు కీపింగ్ లో గాయపడ్డాడు. పంత్ ఎడమ చేతి చూపుడు వేలుకు గాయం అయింది. బూమ్రా విసిరిన బంతిని అడ్డుకునే క్రమంలో పంత్ కు బలమైన గాయం కావడంతో ఆ తర్వాత మైదానం నుంచి బయటకు వెళ్ళాడు.

Also Read : రవిశాస్త్రి లేకపోతే నేను లేను.. టెస్ట్ క్రికెట్ నుంచి అందుకే రిటైర్ అయ్యా..!

ఆ తర్వాత ద్రువ్ జురెల్ కీపింగ్ కు వచ్చాడు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక ప్రకటన చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎడమ చూపుడు వేలికి గాయమైందని తెలిపింది. అతను ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని.. రిషబ్ లేకపోవడంతో ధ్రువ్ జురెల్ ప్రస్తుతం వికెట్ కీపింగ్ చేస్తున్నాడని పేర్కొంది. అయితే కొన్ని నిబంధనల ప్రకారం.. పంత్ స్థానంలో జూరెల్ బ్యాటింగ్ చేయడం కష్టం అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఓ నిబంధన అనుకూలంగా ఉన్నా.. అది అంతర్జాతీయ క్రికెట్ లో వర్తించదు.

Also Read : ఆ నియోజకవర్గాలకు కొత్త బాసులు..!

మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా (ప్రీ-మ్యాచ్ వార్మప్ పీరియడ్‌తో సహా) మైదానంలో తీవ్రమైన గాయానికి గురైన ఆటగాడి స్థానంలో మిగిలిన మ్యాచ్‌కు పూర్తిగా అందుబాటులో ఉండే ఆటగాడిని తీసుకోవచ్చు. అంటే కీపర్ గాయపడితే కీపర్ ను తీసుకోవచ్చు. కాని ఇది దేశవాళి క్రికెట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. రిషబ్ పంత్ స్థానంలో ద్రువ్ జూరెల్ కీపింగ్ చేయవచ్చు. ఒకవేళ పంత్ ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోతే ఆ ప్రభావం జట్టు విజయావకాశాలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్