ప్రస్తుతం కాలంలో కొత్త కొత్త వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది తమ ఆరోగ్యంపై గమనిక పెంచుకున్నారు. అయినా కూడా కొందరు తమ శరీరంలో దాగి ఉన్న ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించలేకపోతున్నారు. అది గుర్తించే సరికి వ్యాధి చివరి దశకు చేరుకొని ఉండటం వల్ల, చికిత్స తీసుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి – వ్యాధి మొదటి దశలలోనే గుర్తిస్తే, చికిత్సకు మంచి అవకాశాలు ఉంటాయి. అందులోను “క్యాన్సర్” వంటి సైలెంట్ కిల్లర్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. క్యాన్సర్ ప్రధానంగా నాలుగు దశలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రారంభ దశలలోనే ఇది గుర్తించగలిగితే, పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది.
Also Read : బజ్ బాల్ ఎక్కడ..? భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కు షేక్ అయింది…!
ఇప్పటికే భారతదేశం వైద్య రంగంలో పెద్ద పురోగతిని సాధిస్తోంది. కొత్త విధానాలు, ఆధునిక పరీక్షల సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. విదేశాల నుండి ప్రముఖ డాక్టర్లు భారతదేశానికి వచ్చి వైద్య పద్ధతులపై శిక్షణ ఇస్తుండగా, భారతీయ వైద్యులు విదేశాల్లో విద్యనభ్యసించి నవీన పరిజ్ఞానం భారత్‌కి తీసుకువస్తున్నారు. క్యాన్సర్ చికిత్స విషయంలో కూడా భారత్ ఇప్పుడు అత్యంత ప్రగతిశీలంగా మారుతోంది. ఒకప్పుడు క్యాన్సర్ అనగానే చావే గమ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, విజయవంతమైన చికిత్స సాధ్యమే. మొదటి రెండు దశలలో క్యాన్సర్‌ను గుర్తించగలిగితే, నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సమస్య ఏమిటంటే – చాలా మందికి క్యాన్సర్ ఉన్నదీ, లేదీ తెలియదు.
Also Read : ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆకుకూర కోసం ఎందుకంత డిమాండ్?
ఈ సమస్యకు పరిష్కారంగా “Predictive Genetic Testing for Cancer” అనే పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఇది ముందుగా క్యాన్సర్‌కు గల అవకాశాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష ఒకప్పుడు కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ వంటి భారతీయ నగరాల్లోనూ ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఉంటే అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాదు – ఎలాంటి క్యాన్సర్ ఉన్నదీ కూడా ఇది గుర్తించగలదు. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారు కూడా, తమ కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందుజాగ్రత్తగా ఈ పరీక్ష చేయించుకోవచ్చు. ఇది సుమారు 70 రకాల క్యాన్సర్‌లను గుర్తించగలదు.
Also Read : కొత్త ఐఫోన్ లుక్ చూసారా..? పక్కా డిఫరెంట్ మామ..!
ముందస్తు పరీక్షలతో ప్రాణాలను రక్షించుకోవచ్చు
చాలామంది క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తించి ప్రాణాలు కోల్పోయారు. డబ్బు, వైద్యం ఉన్నా… సమయానికి గుర్తించకపోతే చికిత్సకు ఫలితం ఉండదు. కానీ, కొన్ని వందలాది మంది ముందే పరీక్షలు చేయించుకుని క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం కాలుష్యం, జీవనశైలి మార్పులు వంటి కారణాలతో క్యాన్సర్ వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం వలన ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అనుమానం ఉన్నా లేకున్నా, సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల మీ జీవితం ఎంతోకాలం సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బుల విషయంలో ముందు జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం ప్రజల/వీక్షకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని andhranews9.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు/సూచనలు తీసుకోగలరు.