పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేక అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 2021 నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. జూన్ 12న సినిమాలు విడుదల చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించిన తర్వాత అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ సినిమా విడుదలవుతుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఎం ఏ రత్నం.. సినిమా ప్రముఖులను కూడా కలిశారు.
Also Read : అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం
ఇటీవల సినిమా ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ లో ఇచ్చిన అడ్వాన్సును నిర్మాతకు వెనక్కు ఇచ్చేసినట్టు వార్తలు వచ్చాయి. మొత్తం 11 కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా వచ్చిన ప్రకటన ప్రకారం సినిమా అధికారికంగా వాయిదా పడింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అలాగే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని సినిమా యూనిట్ తెలిపింది.
Also Read : ఆ తేదీ కోసమే కూటమి నేతల ఎదురుచూపులు..!
అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు ప్రకారం సినిమా విడుదల మరి కొంతకాలం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది దసరాకు హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేసే అవకాశం ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాత పై భారం తగ్గించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన రెమ్యూనిరేషన్ను పూర్తిగా తీసుకోకుండానే సినిమా విడుదల విషయంలో సహకరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ అలాగే ఇతర నటులకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారు నిర్మాత. క్రిష్ జాగర్లమూడి సినిమాను మొదలుపెట్టిన సమయంలో భారీగా ఖర్చు పెట్టారు. మరి సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉండవచ్చో చూడాలి.