Friday, September 12, 2025 03:25 PM
Friday, September 12, 2025 03:25 PM
roots

టార్గెట్ రోజా… పెద్దాయన మాస్ ర్యాగింగ్..!

ఏమైనా సీనియర్.. సీనియరే.. అంటారు. ఇంకా చెప్పాలంటే.. “దెబ్బ అదుర్స్ కదూ..” అంటూ శివాజీ సినిమాలో విలన్ సుమన్‌తో హీరో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడికక్కడ భారీ కేకులు కట్ చేసి అధినేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అన్నదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో అధినేత చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైకత శిల్పాలు, గజ మాలలు, బైక్ ర్యాలీలు.. ఇలా ఒకటేమిటి.. తెలుగు తమ్ముళ్లు తమకు తోచినరీతిలో అధినేత పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు.

Also Read : విశాఖ మేయర్ ఎన్నిక.. జగన్‌కు బూమ్‌రాంగ్..!

ఇక 20వ తేదీ రాత్రి 12 గంటల నుంచే సోషల్ మీడియాలో HappyBirthdayCBN హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ఎవరికి తోచినట్లుగా వాళ్లు అధినేత ఫోటోలు, వీడియోలు ఎడిటింగ్ చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో చంద్రబాబు వీడియోలు, ఫోటోల పోటీ జరిగింది. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాస్ డైలాగ్‌లు, వైసీపీ నేతలకు ఇచ్చిన వార్నింగ్, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రత్యర్థులు చంద్రబాబును పొగిడిన వీడియోలు.. ఇలా ఒకటేమిటి చంద్రబాబు వజ్రోత్సవ జన్మదిన వేళ సోషల్ మీడియా మోత మోగిపోయింది. అయితే ఇన్ని లక్షల వీడియోలు ఉన్నా సరే.. టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మాత్రం విపరీతంగా ట్రోల్ ‌అయ్యింది.

Also Read : పాత స్నేహాలకు పదును పెడుతున్న నానీ

చంద్రబాబు వీడియోలతో చేసిన ప్రోమోకు వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజో వాయిస్ ఓవర్‌ పెట్టారు. “స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త, అపర రాజకీయ మేధాధురదరుడు, పేదల పాలిటి పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశాల వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, తెలుగు సామ్రాజ్య ధీర వీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు” అంటూ చంద్రబాబును ఆర్కే రోజా పొగిడిన వాయిస్‌తో సూపర్ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2009 వరకు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు ఆర్కే రోజా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వ్యవహరించారు కూడా. ఇక 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి కూడా ఓడారు రోజా. ఆ తర్వాత సైలెంట్‌గా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజా.. నాటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. అయితే వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుపై ఒంటికాలితో చెలరేగిపోయారు.

Also Read : హర్ష కుమార్ కు కూటమి భయపడుతుందా..?

చంద్రబాబును అనరాని మాటలతో రెచ్చిపోయారు రోజా. విజనరీ కాదని, పేదలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని.. అసలు చంద్రబాబు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా రోజా చేసిన వ్యాఖ్యలు బాగా ట్రోల్ అయ్యాయి. అలాంటి రోజా.. 2009కి ముందు చంద్రబాబును కీర్తిస్తూ చెప్పిన మాటలతో ఓ వీడియో రూపొందించి దానిని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు బుచ్చయ్య చౌదరి. దీంతో బుచ్చయ్య చౌదరిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. తాతా ర్యాగింగ్ మామూలుగా లేదు గా అని కొందరంటుంటే.. రెండు రోజుల క్రితం తిరుపతిలో రోజా చేసిన వ్యాఖ్యలకు బుచ్చయ్య కౌంటర్ మామూలుగా లేదుగా అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే.. ఏమైనా సీనియర్ సీనియరే… ఒక్క వీడియోతో వైసీపీ నేతల నోటికి తాళం వేయించారు.. అంటూ కితాబిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్