Saturday, September 13, 2025 12:59 AM
Saturday, September 13, 2025 12:59 AM
roots

దుమ్ము రేపిన గిల్, రోహిత్.. టోర్నీ ముందు టీంకు జోష్

ఛాంపియన్ ట్రోఫీ మొదలైన తర్వాత టీమిండియాకు ఐసీసీ ర్యాంకింగ్స్ శుభవార్త చెప్పాయి. టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దుమ్మురేపారు. ఇక టీం పరంగా కూడా టీమిండియా ర్యాంకింగ్ పరంగా సత్తా చాటింది. భారత వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో అతను నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. వన్డే బ్యాటర్ల లిస్టులో 769 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు గిల్.

Also Read : ఆ ఇద్దరి కోసం అగార్కర్, గంభీర్ మధ్య వాగ్వాదం

ఇప్పటివరకు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం 773 పాయింట్లు టాప్ రేటింగ్ లో ఉండగా అతనిని వెనుక్కునెట్టి గిల్ మొదటి స్థానంలో చేరుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సెంచరీ తో రాణించడంతో మూడో స్థానానికి చేరుకున్నాడు. 761 రేటింగ్ పాయింట్లతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 727 పాయింటులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక టీం ర్యాంకింగ్స్ విషయానికొస్తే 119 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది.

Also Read : సెలెక్టర్లపై రహానే సంచలన కామెంట్స్

ఇక చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా గురువారం బంగ్లాదేశ్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈనెల 23న పాకిస్తాన్ లో రెండో మ్యాచ్లో తలపడనుంది భారత జట్టు. భద్రతా కారణాలు దృష్ట్యా పాకిస్థాన్ లో నిర్వహించాల్సిన భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహిస్తుంది ఐసీసీ. ఇంగ్లాండ్ తో.. వన్డే, టి20 సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సత్తా చాటే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో వైట్ వాష్.. ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఘోర ఓటమి తర్వాత ఇంగ్లాండ్ తో స్వదేశంలో సీరీస్ లు గెలవడం ఉత్సాహాన్నిచ్చింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్