Wednesday, October 22, 2025 04:31 AM
Wednesday, October 22, 2025 04:31 AM
roots

ఆ కేసుల్లో బెయిల్.. ఈ కేసుల్లో జైలు.. తురకా కిషోర్ ను వెంటాడుతున్న కేసులు

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వెనుకా ముందూ చూడకుండా రెచ్చిపోయిన వాళ్ళలో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఒకడు. పిన్నెల్లి సోదరుల అండ చూసుకుని మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు, కూనీలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధిష్టానం నుంచి మద్దతు ఉండటంతో తురకా సోదరులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిన తురకా కిషోర్ ను కొన్నాళ్ళ క్రితం, పలు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసారు.

Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!

రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతనిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కు అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చింది కోర్ట్. దీనితో గుంటూరు జిల్లా జైలు నుండి విడుదల అయ్యాడు కిషోర్. ఆ వెంటనే మరొక కేసులో తురకా కిషోర్ ను వెంటనే అదుపులోకి తీసుకున్న రెంటచింతల పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. కిషోర్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీస్ వాహనం ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేయవద్దని డిమాండ్ చేస్తూ హడావుడి చేసారు.

Also Read : లిక్కర్ కేసులో సంచలనం.. 12 అట్టపెట్టెల్లో భారీగా డబ్బు

కిషోర్ ను అరెస్ట్ చేయకుండా పోలీస్ వాహనాన్ని అడ్డుకొని ఆందోళన చేసారు తురకా కిషోర్ సతీమణి. బోరున విలపిస్తూ అరెస్టును కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ మహిళలను పక్కకు నెట్టి కిషోర్ ను అదుపులోకి తీసుకుని వెంటనే రెంటచింతల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిషోర్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వచ్చిన టిడిపి నేతల వాహనంపై దాడి చేసిన కిషోర్.. అనంతరం పలు హత్యాయత్నం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్