ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో తెలుసా.. రచ్చ రచ్చ.. ఇప్పుడు విశాఖ కలెక్టరేట్‌లో ఇదే కీలక అంశం. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ కాస్తా బజారుకెక్కింది. డిఆర్వో భవానీ ప్రసాద్ పైన ఆర్డీవో శ్రీలేఖ సంచనలన ఆరోపణలు చేశారు. ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకుల కోసం కూడా డీఆర్వో భవానీ ప్రసాద్ ఇండెంట్ పెటడుతున్నారనేది శ్రీలేఖ ప్రధాన ఆరోపణ. ఉప్పు, పప్పు, చింతపండుతో పాటు బట్టలు ఆరేసుకునేందుకు కావాల్సిన క్లిప్పులను కూడా ప్రభుత్వ సొమ్ముతోనే భవానీ ప్రసాద్ కొనుగోలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. వీటి కోసం ప్రతినెలా తహశీల్దార్లపై ప్రతీ నెలా ఒత్తిడి చేయాల్సి వస్తోందని ఆర్డీవో శ్రీలక్ష్మి ఆరోపించారు. చివరికి లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు శ్రీలేఖ ఫిర్యాదు చేయడం పెద్ద దుమారం రేపింది.
Also Read : చంద్రబాబు ధైర్యానికి ఫిదా.. బీసెంట్ రోడ్ పర్యటనపై ప్రసంశలు..!
శ్రీలేఖ రాసిన లేఖ బహిర్గతం కావడంతో విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారుల మధ్య అంతర్గత వ్యవహారాలు వెలుగు చూశాయి. డీఆర్వోపై ఆర్డీవో చేసిన ఫిర్యాదు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. ఆర్డీవో శ్రీలేఖకు ఇటీవల కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విశాఖలోని పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు అంశంపై శ్రీలేఖపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిబంధనలు పాటించకుండా విగ్రహం తరలించారనేది ప్రధాన ఆరోపణ. వీటిపై సంజాయిషీ ఇవ్వాలని ఆర్డీవో శ్రీలేఖను కలెక్టర్ ఆదేశించారు. ఆ వెంటనే.. డీఆర్వోపై ఆర్డీవో ఫిర్యాదు చేయం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పంచాయితీ అమరావతికి చేరగా అధికార పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
డీఆర్వో కుటుంబం శ్రీకాకుళంలో ఉంటోందని.. విశాఖ నుంచి ప్రతి నెలా శ్రీకాకుళంప్రతి నెలా 20 వేల విలువైన కిరాణా సామాగ్రి పంపాల్సి వస్తోందని శ్రీలేఖ ఆరోపించారు. దీని ప్రభావంతో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటం ద్వారా ప్రజల్లో చులకన అ్యయ్యే ప్రమాదం ఉందనేది ఇతర సిబ్బంది మాట. డీఆర్వో క్యాంపు ఖర్చుల బిల్లులన్నీ కూడా చేతితో రాసినవే ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టరుకు విన్నవించారు.
Also Read : సమంత–రాజ్ నిడిమోరు లవ్ స్టోరీ నిజమా?
‘దొరికిన వాడే దొంగ’ అన్న నానుడి అన్ని ప్రభుత్వ శాఖలే కాదు.. అన్ని వ్యవస్థలకూ వర్తిస్తుంది. దానికి రెవెన్యూ శాఖ ఏమాత్రం మినహాయింపు కాదు. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్ మర్యాదలు చూసే కీలకమైన శాఖ. ఆ శాఖ పరిధిలో ప్రోటో‘కాల్’ పేరుతో కిందిస్థాయి కార్యాలయాల నుంచి జరిపే అనధికార వసూళ్లు తరచూ వివాదాలకు దారి తీస్తుంటాయి. దీనికి విశాఖ రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న తాజా పరిణామాలే నిదర్శనం. రెవెన్యూ శాఖను ఒక కుదుపు కుదిపేసిన విశాఖ ‘పప్పు, ఉప్పు’ రచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. విశాఖ డీఆర్వోపై ఫిర్యాదు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో లేఖ రాయడంపై రెవెన్యూ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. డీఆర్వో భవానీశంకర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ రచ్చ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వో, ఆర్డీవోలపై వేటు వేసింది. వారిని సాధారణ పరిపాలన శాఖ.. జీఏడీకి సరెండర్ చేస్తూ వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినా రెవెన్యూతో సహా అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రోటోకాల్ వివాదాలు, అవినీతి ఆరోపణలకు పరోక్షంగా ప్రభుత్వం కాడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆస్ట్రేలియాలో గిల్ కష్టమేనా..? ఎందుకీ వైఫల్యం..?
తాజా వివాదం ఒక్క విశాఖ రెవెన్యూ అధికారులకే పరిమితం కాదన్న విషయం ఆ శాఖలో అధికారులందరికీ తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారులతో పాటు, రెవెన్యూ, పోలీస్, సంక్షేమశాఖల జిల్లా అధికారులందరూ ప్రోటోకాల్ పేరుతో దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది ద్వారా తమ ఇళ్లకు కావాల్సిన పప్పులు, ఉప్పులు సరఫరా చేయించుకోవడమనే దుస్సంప్రదాయం పాతుకుపోయింది. జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల ప్రోటోకాల్ అవసరాలను తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు తరచూ మీట్ అవుతుంటారు. జిల్లా ఉన్నతాధికారులు నివసించే బంగ్లాల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం కొంత మొత్తం జమ చేస్తుంటుంది. జిల్లా రెవెన్యూ అధికారి.. డీఆర్వో, రెవెన్యూ డివిజనల్ అధికారుల.. ఆర్డీవోకు నిర్వహణ ఖర్చులు పరిమితంగానే ఉంటాయి. కానీ ఈ ఖర్చులను ఆయా కేంద్రాల్లోని తహసీల్దార్లు భరిస్తుంటారు. నిర్వహణ ఖర్చులతో పాటు, అధికారుల ఇళ్లకు అవసరమయ్యే నెలవారీ సరుకులను ప్రోటోకాల్ పేరుతో మండల స్థాయి అధికారులే ఖర్చులు భరించి సమకూరుస్తుంటారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తంతే. విశాఖ ఆర్డీవో శ్రీలేఖ కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లే అన్ని చోట్లా జరుగుతుంటుంది. అయితే విశాఖ డీఆర్వో, ఆర్డీవోల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ కోపంతోనే డీఆర్వోపై ఆర్డీవో శ్రీలేఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.