సినిమాల్లో పాత్రల కోసం హీరోలు కష్టపడటం మనం చూస్తూనే ఉంటాం. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం.. కండలు పెంచడం, సిక్స్ ప్యాక్ ప్రయత్నాలు చేయడం వంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. డైట్ ప్లాన్, వర్కౌట్స్ వంటివి కూడా సహజమే. ఇది కొన్ని సందర్భాల్లో హీరోలకు ఇబ్బందికరంగా కూడా మారుతూ ఉంటుంది. బాడీ బిల్డింగ్ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రాణాలు కోల్పోయిన హీరోలు కూడా ఉన్నారు. కన్నడలో ఒకరిద్దరు హీరోలు ఇలాగే ప్రాణాలు కోల్పోగా ఇటీవల పంజాబ్ లో కూడా ఓ నటుడు ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : రాజకీయాలకు మరో సీనియర్ నేత గుడ్ బై..!
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. సినిమాల్లో తన పాత్రల కోసం ఎన్టీఆర్ ఎంతలా కష్టపడతాడో మనం చూస్తాం. గతంలో లావుగా ఉండే ఎన్టీఆర్ తర్వాత బరువు తగ్గి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ప్రేక్షకులను కూడా భయపెడుతున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోల్లో అతను చాలా సన్నగా కనపడటమే కాకుండా ముఖ కవళికల్లో కూడా మార్పులు వచ్చాయి. గుర్తుపట్టలేని విధంగా ఎన్టీఆర్ ఉండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
Also Read : ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆదేశాలు
వార్ 2 సినిమా ముందు ఎన్టీఆర్ బాగానే ఉన్నాడు. దేవర సినిమాలో కూడా గతంలో మాదిరిగా కనిపించాడు. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్లు కనపడింది. అయితే ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి కొంతమంది అయితే ఎన్టీఆర్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పాత్ర కంటే ఆరోగ్యం ముఖ్యమని.. ప్రాణాలకు తెగించి ఏ పాత్ర చేయవద్దని ఎన్టీఆర్ ను ఫాన్స్ కోరుతున్నారు.