సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ విషయంలో విమర్శలు చేయడం అనేది సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా రాజకీయాలు, క్రీడలు, సినిమాల విషయంలో ఇది కాస్త ఎక్కువే. రాజకీయాల్లో ఏది మాట్లాడినా తప్పే, సినిమాలో ఏ కథ ఎంచుకున్నా తప్పే, క్రికెట్ లో ఎలా ఆడినా సమస్యే అన్నట్టు మారింది పరిస్థితి. క్రికెట్ విషయానికి వస్తే.. కొందరు ఆటగాళ్లను పదే పదే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రోల్ అయ్యే జాబితాలో సాయి సుదర్శన్ ను కూడా చేర్చారు.
Also Read : వీసా లేకుండా భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చంటే..?
మొదటి టెస్ట్ లో అతనికి అవకాశం కల్పించారు. కాని అతను విఫలం అయ్యాడు. ఇక రెండు, మూడు టెస్ట్ లకు పక్కన పెట్టారు. నాలుగో టెస్ట్ లో అతనికి అవకాశం వచ్చింది. కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్.. వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే పరుగులు చేసాడు. 151 బంతులు ఆడాడు ఈ తమిళనాడు బ్యాట్స్మెన్. అద్భుతమైన డిఫెన్స్ తో ఆకట్టుకున్నాడు. కాని సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ ఓ రేంజ్ లో ఉంది.
Also Read : బ్రేకింగ్: ఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐ చేతికే..?
20 పరుగుల వద్ద అతనికి ఓ చిన్న లైఫ్ వచ్చింది. దాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఇంగ్లాండ్ మొదటి, మూడు టెస్టుల్లో గెలవడానికి క్యాచ్ లు వదిలేయడమే కారణం. ఆ జట్టు ఆటగాళ్ళు స్మిత్, రూట్, బ్రూక్ లకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటి గురించి మాట్లాడని ఇంగ్లాండ్ అభిమానులు సాయి సుదర్శన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి భారత అభిమానులు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. రియాలిటీలోకి రావాలని, ఇంగ్లాండ్ సీరీస్ గెలిచినా సరే అది క్యాచ్ డ్రాప్ ల పుణ్యమే గాని ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన కాదని కౌంటర్ లు ఇవ్వడం మొదలుపెట్టారు.