Friday, September 12, 2025 03:02 PM
Friday, September 12, 2025 03:02 PM
roots

ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

లార్డ్స్ వేదిక ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన 3వ టెస్ట్ చివరి రోజు.. టెస్ట్ క్రికెట్ మజా చూసారు క్రికెట్ అభిమానులు. ఓడిపోతుందనుకున్న భారత జట్టును ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. తన పోరాట స్పూర్తితో గెలుస్తుందా అనే వరకు తీసుకువెళ్ళాడు. నిధానంగా వికెట్ కాపాడుకుంటూ ఒక్కో పరుగు జోడిస్తూ కొండంత లక్ష్యంగా కనపడిన స్వల్ప లక్ష్యాన్ని నిదానంగా కరిగిస్తూ వచ్చాడు. బౌలర్లు బూమ్రా, సిరాజ్ తో కలిసి జడేజా చేసిన పోరాటం మాత్రం అద్భుతం అనే చెప్పాలి.

Also Read : మళ్ళీ ఢిల్లీకి బాబు.. ఏపీకి మోడీ

అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా గెలిచేది. కాని చిన్న చిన్న తప్పులతో మ్యాచ్ ను చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్.. జేమి స్మిత్ క్యాచ్ వదిలేయడంతో ఇంగ్లాండ్ 50 పరుగులు లాభపడింది. ఇక అదనపు పరుగుల రూపంలో ఇంగ్లాండ్ కు 63 పరుగులు కలిసి వచ్చాయి. ఫీల్డర్ల తప్పిదం, బౌలర్ల తప్పిదాల కారణంగా ఇంగ్లాండ్ లాభపడింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ రనౌట్ కావడం కూడా మ్యాచ్ ను మలుపు తిప్పింది. పటిష్ట స్థితిలో భారత్ ఆ తర్వాత కష్టాల్లో పడింది.

Also Read : భారత్ కు మరో స్టీవ్ బక్నర్ తయారయ్యాడు..!

రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ ఆడిన షాట్ భారత్ ను మరింత ఇబ్బంది పెట్టింది. లక్ష్యం చిన్నదే అయినా దూకుడుగా ఆడాలి అనుకోవడంతో వికెట్ కోల్పోయాడు. ఇక మ్యాచ్ లో అద్భుత పోరాటం చేసిన బూమ్రా.. అనవసరంగా షార్ట్ పిచ్ బాల్ ఆడటంతో భారత్ మరింత ఇబ్బంది పడింది. బూమ్రా వికెట్ ఉండి ఉంటే భారత్ ఖచ్చితంగా గెలిచేది. ఇక షాట్ సెలెక్షన్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి, జైస్వాల్, నాయర్ ఇలా ఒక్కొక్కరు చేసిన తప్పులు మ్యాచ్ ను ఇంగ్లాండ్ చేతిలో పెట్టాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్