Wednesday, February 4, 2026 11:31 PM
Wednesday, February 4, 2026 11:31 PM

ఐపిఎల్ లో హైదరాబాద్ కథ ముగిసిందా..?

గత ఐపీఎల్ సీజన్ లో భారీ స్కోర్లకు తెరలేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మాత్రం తడబడుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో ఒక్కసారి మాత్రమే 200 కంటే ఎక్కువ స్కోర్ చేసింది. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ లో కూడా ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్ లైనప్ తడబడుతూ వస్తుంది. ముఖ్యంగా ఆ జట్టు టాప్ ఆర్డర్ వీక్నెస్ ను ప్రత్యర్ధి జట్లు స్పష్టంగా అర్థం చేసుకున్నాయి. పవర్ ప్లే లో పరుగులు కట్టడి చేస్తే ఎస్ఆర్హెచ్ పరుగులు చేసే అవకాశం లేదనే అవగాహనకు వచ్చిన ప్రత్యర్థులు ఓపెనర్లను ఎక్కువగా టార్గెట్ చేశారు.

Also Read : రబాడాపై బీసీసీఐ పగ సాదిస్తోందా..?

మొదటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీతో దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత అతనిని కంట్రోల్ చేసేసారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు దూకుడుగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో కూడా సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ క్లాసేన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలక సమయాల్లో వీళ్లు చేతులెత్తేయడంతో హైదరాబాద్ ఓటమి పాలవుతోంది. దీంతో ఈ సీజన్లో ఆ జట్టు పని అయిపోయింది అనే అభిప్రాయాలు గట్టిగా వినపడుతున్నాయి.

Also Read : బ్రేకింగ్: మిథున్ రెడ్డికి హైకోర్ట్ బిగ్ షాక్

ఇక బౌలింగ్ విభాగం కూడా పెద్దగా బలంగా లేదు. కీలక సమయాల్లో వికెట్లు తీసినా.. పరుగులు కట్టడి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. కెప్టెన్ కమ్మిన్స్ కూడా భారీగా పరుగులు ఇచ్చేయడంతో మిగిలిన బౌలర్లు కూడా తేలిపోతున్నారు. తాజాగా కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. వెంకటేష్ అయ్యర్ భారీగా పరుగులు చేస్తున్న సమయంలో అతన్ని కట్టడి చేయలేకపోయారు. ప్రతి మ్యాచ్ లో 300 కొట్టడానికి ట్రై చేస్తామని చెప్తున్న ఎస్ ఆర్ హెచ్.. కనీసం 200 కూడా స్కోర్ చేయలేకపోవడంతో అభిమానులు డీలా పడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్