శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం నాడు పన్నెండు రాశుల్లో ఇవాళ (9 ఆగస్టు 2025 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది?
మేషం 09-08-2025
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————
వృషభం 09-08-2025
వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు కొంత పురోగమిస్తాయి.
—————————————
మిధునం 09-08-2025
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
—————————————
కర్కాటకం 09-08-2025
ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
—————————————
సింహం 09-08-2025
నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————
కన్య 09-08-2025
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.
—————————————
తుల 09-08-2025
బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.
—————————————
వృశ్చికం 09-08-2025
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————
ధనస్సు 09-08-2025
నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన యోగమున్నది.
—————————————
మకరం 09-08-2025
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
—————————————
కుంభం 09-08-2025
మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంభందించి జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి కొంత ఇబ్బందులు తప్పవు.
—————————————
మీనం 09-08-2025
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.
—————————————