Saturday, August 30, 2025 02:21 AM
Saturday, August 30, 2025 02:21 AM
roots

ఈరోజు (08-08-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం నాడు పన్నెండు రాశుల్లో ఇవాళ (8 ఆగస్టు 2025 శుక్రవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది?

మేషం 08-08-2025

మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి.

—————————————

వృషభం 08-08-2025

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

—————————————

మిధునం 08-08-2025

చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

కర్కాటకం 08-08-2025

సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

—————————————

సింహం 08-08-2025

కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

—————————————

కన్య 08-08-2025

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన రుణయత్నాలు కలసిరావు. స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

—————————————

తుల 08-08-2025

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

—————————————

వృశ్చికం 08-08-2025

సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.

—————————————

ధనస్సు 08-08-2025

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

—————————————

మకరం 08-08-2025

ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కుంభం 08-08-2025

సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

—————————————

మీనం 08-08-2025

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్