Sunday, October 19, 2025 03:53 AM
Sunday, October 19, 2025 03:53 AM
roots

ఈరోజు (14-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 14-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 14-10-2025

పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. .దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

వృషభం 14-10-2025

నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేయనుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికం గా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు.

—————————————

మిధునం 14-10-2025

అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకోడీగా సాగుతాయి.

—————————————

కర్కాటకం 14-10-2025

అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి.

—————————————

సింహం 14-10-2025

ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

—————————————

కన్య 14-10-2025

విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.

—————————————

తుల 14-10-2025

పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

—————————————

వృశ్చికం 14-10-2025

దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానానికి విద్య ఈ విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

—————————————

ధనస్సు 14-10-2025

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు.

—————————————

మకరం 14-10-2025

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది. కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

—————————————

కుంభం 14-10-2025

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రధ్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం.

—————————————

మీనం 14-10-2025

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల గూర్చి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

————————————-

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్