Sunday, October 19, 2025 11:55 AM
Sunday, October 19, 2025 11:55 AM
roots

ఈరోజు (07-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 07-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 07-10-2025

చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు కలసి రావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

వృషభం 07-10-2025

ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

—————————————

మిధునం 07-10-2025

వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.

—————————————

కర్కాటకం 07-10-2025

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లభిస్తుంది.

—————————————

సింహం 07-10-2025

వృత్తి వ్యాపారాలలో అదిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.

—————————————

కన్య 07-10-2025

ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. స్ధిరాస్తి సంభందిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

తుల 07-10-2025

ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

 

—————————————

వృశ్చికం 07-10-2025

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

—————————————

ధనస్సు 07-10-2025

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

—————————————

మకరం 07-10-2025

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్దులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.

—————————————

కుంభం 07-10-2025

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంట బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

మీనం 07-10-2025

ఆత్మీయ్యుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్