అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోంది. తాజాగా హెచ్ 1 బీ వీసా ఫీజులను పెంచుతూ ట్రంప్ సంతకం చేసారు. దీనితో చైనా సహా అనేక దేశాలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా చైనా విదేశీ నిపుణులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కే వీసా పేరుతో కొత్త వీసాను పరిచయం చేసి, తమ దేశానికి రావాలని ఆహ్వానించింది బీజింగ్. ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసాలతో పోలిస్తే.. కే వీసాలు అనేక సౌలభ్యాలను అందిస్తున్నాయి.
Also Read : డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీలో అందుకే చేర్చడం లేదా..?
చైనాలోకి అడుగుపెట్టిన తర్వాత, వీసా హోల్డర్లు విద్య, సంస్కృతి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాలలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆయా రంగాల్లో కొత్త వ్యాపారాలు స్థాపించడానికి, ప్రస్తుత వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడానికి కూడా అనుమతి ఉంటుంది. సాధారణంగా స్థానిక మానవ వనరులకే చైనా ప్రాధాన్యత ఇస్తుంది. కాని ఇప్పుడు మాత్రం తన విధానాన్ని మార్చుకుంది చైనా. దేశ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల భాగస్వామ్యం అవసరమని, చైనా అభివృద్ధి వారికి అవకాశాలను కూడా అందిస్తుందని ప్రకటించింది.
Also Read : ప్రభాస్ పై బాలీవుడ్ మాఫియా దాడి..!
సైన్స్, టెక్ నిపుణుల అవసరం తమకు ఎంతో ఉందని చైనా తెలిపింది. వీసాల నిబంధనల విషయంలో కూడా చైనా కాస్త ప్రపంచ దేశాలకు అనేక సౌలభ్యాలను కల్పించింది. బీజింగ్ నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, 2025 మొదటి ఆరు నెలల్లో విదేశీ పౌరులు చైనాకు లేదా చైనా నుండి మొత్తం 38.05 మిలియన్ల సార్లు ప్రయాణం చేసారు. గత ఏడాదికి ఈ ఏడాది 30.2 శాతం పెరిగింది. ఈ ప్రయాణాలలో, 13.64 మిలియన్లు వీసా రహిత ప్రయాణాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 53.9 శాతం పెరుగుదల ఇది.