ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 తరహా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇప్పటివరకు పరిపాలనను గాడిలో పెట్టేందుకు కష్టపడుతూ వస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు క్షేత్రస్థాయి వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు స్వయంగా.. తానే సమాధానం చెప్పేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇటీవల నకిలీ మధ్య వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి, దేశంలో ఎక్కడా లేనివిధంగా సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు.
Also Read : ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆదేశాలు
ఇక ఇప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులను పరుగులు పెట్టించేందుకు సీఎం రెడీ అవుతున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు సీఎం. 1995 తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేసి అధికారులను పరుగులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. సమర్థవంతంగా పనిచేయని అధికారులను అక్కడికక్కడే బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేయడం వంటివి చేసేవారు ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించలేదు.
Also Read : రాజకీయాలకు మరో సీనియర్ నేత గుడ్ బై..!
ఇక ఎప్పుడు మాత్రం అధికారులకు అవకాశం ఇవ్వకూడదని సీఎం పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు బదిలీలు కూడా అక్కడే చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రజల అభిప్రాయం స్వయంగా తెలుసుకోవడమే కాకుండా.. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల పనితీరును సీఎం స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవిన్యూ శాఖ విషయంలో తీవ్ర విమర్శలు కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనితో ఆ శాఖపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించే అవకాశం ఉంది. పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సీఎం తన క్షేత్రస్థాయి పర్యటనల్లో దృష్టి పెట్టే అవకాశం ఉండవచ్చు. అలాగే వైద్య, విద్య విషయంలో కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, సీఎం ఆ శాఖలను కూడా సీరియస్ గా తీసుకుని అడుగులు వేయనున్నారు.