Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

రాజధాని అమరావతికి మరో బిగ్ న్యూస్..!

రాజధాని అమరావతి నిర్మాణాన్ని అనుకున్న గడువు లోపు పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. అనుకున్నట్లుగానే ఇప్పటికే రూ.55 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసిన సీఆర్‌డీఏ అధికారులు.. త్వరలోనే అమరావతి నిర్మాణ పనులను పట్టాలెక్కించనున్నారు. 2027 జూన్ నాటికి అమరావతి ఫేస్ -1 పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు వేగం అందుకున్నాయి. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేది లేదని తేల్చి చెప్పారు. అమరావతి నిర్మాణానికి కేంద్రంతో పాటు పలు ఆర్థిక సంస్థలు అండగా నిలుస్తున్నాయి.

Also Read : రెండు నాల్కల ధోరణిలో సాక్షి.. మార్పు రాదా?

అమరావతి పనులు తిరిగి మొదలుపెట్టేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెల మూడో వారంలో ప్రధాని పర్యటన దాదాపు ఖరారైంది. ప్రధాని చేతుల మీదుగా అమరాతి పనులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు భూమి సిద్ధం చేసింది. ఆ భూమిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రధాని పర్యటన వచ్చే లోపే కొన్ని పనులు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పరిసరాల్లో చదును పనులు మొదలయ్యాయి. అలాగే సీఆర్‌డీఏ కార్యాలయ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇక దాదాపు తుది దశకు చేరుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ భవనాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Also Read : హమ్మయ్య.. మిథున్ రెడ్డి సేఫ్..!

అమరావతి పనులపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించిన సమయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా వివిధ సంస్థల నుంచి తీసుకునే రూ.15 వేల కోట్ల రుణాలకు కేంద్రం ఇప్పటికే గ్యారంటీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తొలి విడతగా రూ.4,285 కోట్ల నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతి పనుల పునఃప్రారంభానికి మార్గం సుగమం అయ్యింది. ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడతగా 205 మిలియన్ డాలర్లు అందుకున్న కేంద్రం… ఏపీకి రూ.4,285 కోట్ల నిధులన్ని విడుదల చేసింది. అమరావతి ఫేజ్-1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి 1600 మిలియన్ డాలర్లు అంటే రూ.13,600 కోట్లు రుణం ఇచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంకు 800 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. తొలి దశ అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే రూ.15 వేల కోట్ల కోట్లు కేటాయించగా.. మరో రూ.1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం ఇస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్