ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు మరోసారి ప్రారంభమైంది. ఇందులో భాగంగా భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై ఈ సమీక్ష జరుగుతోంది. శాంతి భద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో ఆరా తీస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రజంటేషన్‌ను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ఇవ్వనున్నారు. నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. నాలుగన్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
Also Read: మా నాన్న.. మా నాన్న కాదు.. మనోజ్ సంచలన ప్రెస్ మీట్
ఇక కొందరు కలెక్టర్ లు, ఎస్పీలు, డీఎస్పీల తీరుపై చంద్రబాబు మండిపడినట్టు తెలుస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో జరుగుతున్న రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని… 2019-24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో ఒకే ఒక్కసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారన్న చంద్రబాబు… అప్పుడు ఉన్నతాధికారులు కూడా తమకు నచ్చినట్టు వ్యవహరించేవారని, సంక్షేమ కార్యక్రమాల అమలులో, సహజ వనరుల దోపిడీలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు కలెక్టర్లు వ్యవహరించారని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
Also Read: కృష్ణయ్య కు రాజ్యసభ అభ్యర్ధిత్వం వెనుక బిజెపి భారీ వ్యూహం
గతంలో గంజాయిని విచ్చలవిడి చేయడంలో అధికారుల పాత్ర కూడా ఉందని… కనీస బాధ్యత లేకుండా వ్యవహరించారని చంద్రబాబు కొందరు కలెక్టర్లపై నేరుగానే సీరియస్ అయ్యారు. టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో గంజాయిని నిర్మూలిస్తున్నామని పేర్కొంటూ.. ఇప్పుడు ఎవరైనా అధికారులు గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి సహకరిస్తే… ఐఏఎస్, ఐపిఎస్ అధికారులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్ కి రాష్ట్రం చీకటిలో ఉందన్న చంద్రబాబు… రెండో కాన్ఫరెన్స్ ఇది ఇప్పుడప్పుడే రాష్ట్రంలో వెలుగులు వస్తున్నాయన్నారు.
Also Read: పేర్నికి మూడింది.. అడ్డంగా దొరికాడా..?
గతంలో సీనియర్ ఆఫీసర్ లకు కూడా 10 తేదీకి జీతాలు రాని పరిస్థితి ఉండేదాన్న ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జీతాలు, పెన్షన్ లు అన్ని 1వ తేదీకి ఇస్తున్నామని తెలిపారు. తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదని తప్పు చేసిన వాళ్ళని చట్టప్రకారం శిక్షించాలని స్పష్టం చేసారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ పోయిందని, ఇందులో అధికారులు కూడా కీలక పాత్ర పోషించారని చంద్రబాబు మండిపడ్డారు. తూతూ మంత్రంగా సమస్యల పరిష్కరం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు… మనం పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం అని స్పష్టం చేసారు.