తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై వేటు తప్పదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. అది ఏ స్థాయి నేత అయినా సరే.. పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే. అధినేత అయినా గ్రామస్థాయి నేత అయినా కూడా.. కార్యకర్తకు విలువ ఇవ్వాల్సిందే. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు ఇదే సూత్రాన్ని పార్టీ లోని ప్రతి ఒక్కరు నేటికీ అనుసరిస్తున్నారు. ఎవరైనా తోక జాడిస్తే.. నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తారు తప్ప.. ఏ మాత్రం భరించలేదు. అధికారం ఉన్నా… లేకున్నా కూడా ఇదే సూత్రం అనుసరిస్తోంది తెలుగుదేశం పార్టీ. తాజాగా మరో నేతపై ఈ తరహా వేటు సిద్ధమైందనే మాట బలంగా వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు.. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్.
Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు
సాధారణ కార్యకర్తగా ఉన్న కొలికిపూడికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చారు. కనీసం వార్డు మెంబర్ కూడా కానీ కొలికిపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో సఖ్యతగా ఉంటానని.. తనకు అంతా సమానమే అని.. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉంటానని గెలిచిన తర్వాత అందరికీ హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాటపై పట్టుమని పది రోజులు కూడా నిలబడలేదు. అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో అయితే నేనే రాజు.. నేనే మంత్రి.. అన్నట్లు కూడా వ్యవహరించారు. కూటమి పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలపై దాడులకు కూడా తెగబడ్డారు. పత్రికా విలేకరులపై కూడా రెచ్చిపోయారు. చివరికి సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోతే.. నా పదవికి రాజీనామా చేస్తా అంటూ అల్టీమేటం కూడా జారీ చేశారు కొలికిపూడి.
Also Read : ఎమ్మెల్సీగా నాగబాబు టార్గెట్ ఫిక్స్..!
అయితే ఇదే సమయంలో ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఏకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎదురుగానే కొలికిపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారం అంతా పార్టీకి తలనొప్పిగా మారింది. తాత్కాలికంగా ఈ ఆందోళనకు పల్లా చెక్ పెట్టారు. దీనిపై వాస్తవాలు వెల్లడించాలంటూ త్రీ మెన్ కమిటీని కూడా అపాయింట్ చేసారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కొలికిపూడి విషయంపై చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారనే విషయం బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఎంపీ కేశినేని చిన్ని కూడా పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో చిన్నచిన్న ఇబ్బందులు వస్తుంటాయని.. దానిపై కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు.
Also Read : బ్రేకింగ్: మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం
కానీ తాజాగా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో పర్యటించిన సమయంలో కొలికిపూడి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు ఏ స్థాయిలో సీరియస్‌గా ఉన్నారో అర్థమవుతోంది. హెలిప్యాడ్ వద్దకు వచ్చిన నేతలను నవ్వుతూ పలకరించారు చంద్రబాబు. ఎంపీ కేశినేని చిన్నితో పాటు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రులు స్వామి, వంగలపూడి అనిత, మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు పార్టీ నేతలను మర్యాద పూర్వకంగా పలకరించారు. అదే సమయంలో ముందుకు వచ్చిన కొలికిపూడిని సైలెంట్‌గా సైడ్ చేసేశారు. పక్కనే ఉన్న వ్యక్తి భుజం మీద చెయ్యి వేశారు తప్ప… కొలికిపూడిని ఏ మాత్రం పట్టించుకోలేదు.
Also Read : కొంప ముంచిన వాయిస్ మెసేజ్..!
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబు తీరును తిరువూరు నియోజకవర్గం ప్రజలు స్వాగతిస్తున్నారు. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటే అర్థం చేసుకున్న అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏస్థాయి నేత అయినా సరే పార్టీ లైన్ దాటకూడదని.. కార్యకర్తకు విలువ ఇచ్చిన నేతకే రాజకీయాల్లో మనుగడ, భవిష్యత్తు ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం… కొలికిపూడి కథ ముగిసినట్లే.. అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే… పార్టీని కాదన్న వారిపై వేటు తప్పదనే మాటను అటు కార్యకర్తలు, ఇటు నేతలకు కూడా తెలిసేలా చంద్రబాబు వ్యవహరించారు.