Friday, September 12, 2025 03:31 PM
Friday, September 12, 2025 03:31 PM
roots

నా భార్య ఫోన్ కాల్స్ రికార్డ్ చేశాడు.. హరీష్ రావు పై యువకుడి సంచలన ఆరోపణలు

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పేరు ఎక్కడా బయటకు రాలేదు. తాజాగా ఆయనపై హైదరాబాద్ లో సిద్ధిపేట యువకుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయింది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ పై ఫిర్యాదు చేసాడు. ఇక కేసు నమోదు అయిన అనంతరం చక్రదర్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసాడు. 2023నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన కొట్లాడుతున్న… నా కృషి వల్లే హరీష్ రావు పై FIR అయ్యిందని హర్షం వ్యక్తం చేసాడు.

Also Read : అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!

నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న చక్రధర్ గౌడ్ నన్ను రాధకిషన్ రావు చంపుతా అని బెదిరించాడని… ఆయనపై కూడా ఫిర్యాదు చేశా అని పేర్కొన్నాడు. నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం చేసి అని ఫేక్ కేసు పెట్టారని సిద్దిపేట లో వార్ రూమ్ ఏర్పాటై చేసి ప్రనిత్ నేతృత్వంలో ట్యాప్ చేశారన్నాడు. ఫోన్ ట్యాప్ చేసి ఎన్నో కుటుంబాలను ,వ్యాపారస్తులను లొంగదీసుకున్నారని… యాపిల్ ఫోన్ కు ఫోన్ ట్యాప్ అయినట్లై మెసేజ్ వచిందని హరీష్ రావు నా ఫోన్ ను సంవత్సరం పాటు ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేసారు.

Also Read : ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్

నా ఇంట్లో భార్య, తల్లితో ,డ్రైవర్ తో మాట్లాడింది అన్ని రికార్డ్ చేశారని కీలక ఆరోపణలు చేసారు. హరీష్ రావు ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలని డిమాండ్ చేసారు. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు ముందుకు రావాలి.. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు కీలకమన్నాడు చక్రధర్ గౌడ్. నన్ను ఇబ్బందులు పెట్టి బిఅరెస్ పార్టీలోకి రమ్మన్నారని హరీష్ రావు తో నాకు ప్రాణహాని ఉందని డిజిపికి విన్నవించకున్న అని చెప్పుకొచ్చాడు. హరీష్ రావు చేసినవాన్ని స్కాములే… అన్ని బయటపెడుతా అంటూ ప్రకటించాడు. రాధకిషన్ రావు కస్టడీలోకి తీసుకుంటే అంత బయటపడుతుంది.. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారని హరీష్ రావు కమిషన్ ల కోసమే కమిట్మెంట్స్ ఇస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు చక్రధర్ గౌడ్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్