గర్భధారణ విషయంలో మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. డైట్ ప్లానింగ్ తో పాటుగా ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉంటారు. ఇదే సమయంలో మద్యపానం అలవాటు ఉన్న మహిళలు కూడా తమ గర్భధారణ సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఉంటారు వైద్యులు. ఈ విషయంలో భారత్ లో స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం.. మహిళలు మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమని సూచిస్తున్నారు వైద్యులు.
Also Read : వైసీపీ నుంచి మరో సీనియర్ అవుట్..!
గర్భంలో అభివృద్ధి చెందే శిశువుపై మద్యం తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలతో పాటు, గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న వారు కూడా మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మద్యం సేవిస్తే.. రక్త ప్రవాహంలో మద్యం చేరుతుందని, అది శిశువుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి గర్భం కోల్పోవడానికి కూడా ఇది కారణం అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు రక్తం ఎంతో కీలకం కాబట్టి, మద్యానికి దూరంగా ఉండాలని కోరుతున్నారు.
Also Read : ఆస్ట్రేలియా టూర్ కు కొత్త కెప్టెన్, జట్టు ఇదే..!
అలాగే గర్భం తో ఉన్న మహిళలు మద్యం సేవిస్తే, గర్భంలోనే శిశువు చనిపోయే అవకాశాలు ఎక్కువట. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, ఇదే సమయంలో పిల్లలకు అంగ వైకల్యం, అలాగే జ్ఞాపకశక్తి లోపించడం, మూగ, చెవిటి సమస్యలు రావడం, మాటల్లో స్పష్టత రాకపోవడం, వంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతాయి. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించడం వంటివి జరుగుతాయి. అలాగే పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.