టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా మరోసారి జట్టుకు ఆపద్బాంధవుడు అయ్యాడు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు టీం ఇండియా ప్రదర్శనలో బూమ్రా కీ రోల్ ప్లే చేసాడు. ఒంటి చేత్తో భారత్ ను మ్యాచ్ లో నిలిపి పరువు కాపాడాడు. ఇతర బౌలర్ల నుంచి సహకారం అందకపోయినా బూమ్రా మాత్రం తన మార్క్ బౌలింగ్ తో ఆసిస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించాడు. అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ ముందు బూమ్రా బౌలింగ్ లో కాస్త హడావుడి చేసినా… ఆ తర్వాత జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు.
Also Read : ఓపెనర్ గా రోహిత్.. నితీష్ కు షాక్…!
ఆ తర్వాత ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ దిశగా వెళ్ళే క్రమంలో జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ డెలివరీలతో భారత్ ను సజీవంగా ఉంచాడు. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా దూకుడు చూస్తే… వికెట్ పడటం కష్టమే అనే భావన కలిగింది. ఆరు వికెట్లు పడగా అందులో మూడు వికెట్లు బూమ్రా తీసుకున్నాడు. ఈ సీరీస్ లో రెండు సెంచరీలు చేసి దూకుడు మీదున్న ట్రావిస్ హెడ్ ను పరుగుల ఖాతా తెరవకుండానే బౌల్డ్ చేసి షాక్ ఇచ్చాడు బూమ్రా.
Also Read : అధికారులను వెంటాడుతున్నారు.. సిద్దమవుతున్న మరిన్ని కేసులు
తర్వాతి ఓవర్‌లో, ఫామ్ లో లేని మిచెల్ మార్ష్ (4)ను వెనక్కు పంపాడు. ఖవాజా వికెట్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. బూమ్రా బంతిని తప్పుగా అంచనా వేసిన ఖవాజా పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేసి కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి రెండు సెషన్ లు ఆస్ట్రేలియా డామినేషన్ నడిచినా… ఆ తర్వాత మాత్రం బూమ్రా అటాక్ తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. చివరి సెషన్ అంతా బుమ్రా మ్యాజిక్‌పైనే సాగిందని చెప్పాలి. ప్రస్తుత సిరీస్ లో 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు బూమ్రా.




