Saturday, September 13, 2025 12:33 AM
Saturday, September 13, 2025 12:33 AM
roots

విదేశీ బోర్డులపై బీసీసిఐ ఒత్తిడి..? ఐపిఎల్ కోసం బోర్డు సాహసం..?

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనితో విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వారి వారి దేశాలకు చార్టెడ్ ఫ్లైట్స్ లో పంపింది బోర్డు. అయితే పరిస్థితులు సద్దుమణిగిన తరుణంలో.. తిరిగి ఐపిఎల్ ను ప్రారంభించేందుకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది బోర్డు. మరో మూడు రోజుల్లో.. అంటే మే 17 నుంచి ఐపిఎల్ తిరిగి ప్రారంభం కానుంది. దీనితో ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ లు కూడా మొదలుపెట్టాయి.

Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

ఇక వారం పాటు వాయిదా వేయడంతో.. తమ తమ దేశాలకు వెళ్ళిన విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్ రప్పించేందుకు కష్టపడుతోంది బోర్డు. భద్రతా కారణాలతో పలు దేశాలకు చెందిన ఆటగాళ్ళు తిరిగి భారత్ వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీనితో ఆయా దేశాల బోర్డులతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్చలు జరిపి.. తిరిగి పంపించాలని ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ళు తిరిగి భారత్ రావడానికి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.

Also Read : ఇదీ కింగ్ బ్రాండ్.. హోరెత్తుతున్న సోషల్ మీడియా

భద్రత విషయంలో బోర్డు పెద్దలు హామీ ఇచ్చినా వారు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ తిరిగి వచ్చేందుకు సిద్దంగా లేకపోవడంతో రికీ పాంటింగ్ వారితో చర్చలు జరుపుతున్నాడు. ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తిరిగి వచ్చేందుకు సిద్దంగా లేడని సమాచారం. కాగా జూన్ 11 నుండి లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న నేపధ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఆ మ్యాచ్ పై ఫోకస్ పెట్టడంతోనే తిరిగి రావడం లేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్