తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడం ప్రభావంతో పెద్ద ఎత్తున వర్ష పాతం నమోదు కావడంతో.. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. కామారెడ్డితో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వరదలు చుక్కలు చూపించాయి. సిరిసిల్ల జిల్లాలో కూడా వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో ఓ ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో భారీగా వరదలు రావడంతో అక్కడి ప్రజలు చిక్కుకుపోయారు.
Also Read : ఉక్రెయిన్ పై మోడీ యుద్ధం.. అమెరికా సంచలన కామెంట్స్
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే కేంద్ర రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఆర్మీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లను పంపాలని కోరారు. ముందు వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ లను ఆర్మీ పంపలేదు. సమీపంలోని నాందేడ్, బీదర్ నుంచి పంపిస్తామని ప్రకటించి అక్కడి నుంచి పంపి వరదలో చిక్కుకున్న వారిని కాపాడింది. హెలికాప్టర్ లు వస్తున్న విషయం తెలుసుకున్న బండి సంజయ్ నేడు మధ్యాహ్నం నర్మాల చేరుకున్నారు.
Also Read : సెలూన్ షాపుల్లో జాగ్రత్త.. వైద్య నిపుణుల వార్నింగ్..!
హెలికాప్టర్ లు రాగానే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాణాలు కాపాడారు. దీనితో క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. రియల్ హీరో అంటూ అక్కడి ప్రజలు కొనియాడారు. బాధితులకు కేంద్ర మంత్రి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం కూడా అందించారు. నర్మాలలో మంత్రి రాగానే అక్కడికి మాజీ మంత్రి కేటిఆర్ కూడా చేరుకొని బండి సంజయ్ కి థాంక్స్ చెప్పారు. వాహనం దిగిన వెంటనే బండి సంజయ్ కు అభివాదం చేసి కుశల ప్రశ్నలు వేసుకున్నారు.