టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో బాలయ్య, థమన్ కాంబినేషన్ ఒకటి. ఈ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా డిక్టేటర్ కాగా.. అఖండ సినిమా నుంచి ఈ కాంబినేషన్ కొనసాగుతోంది. బాలయ్య సినిమాకు దర్శకుడు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం థమన్ ఉండల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ కు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ బెస్ట్ ఔట్ పుట్ ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సాధారణంగా బాలయ్య టెక్నీషియన్లకు బహుమతులు ఇవ్వడం అరుదుగా జరుగుతుంది.
Also Read: బన్నీ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ.. త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చినట్టే..!
బాలయ్య నుంచి థమన్ కు ఖరీదైన బహుమతి అందడం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. ఖరీదైన లగ్జరీ కారును బాలయ్య థమన్ కు బహుమతిగా ఇవ్వడం గమనార్హం. ఓ తమ్ముడికి అన్నయ్య సంతోషంగా ఇస్తున్న కానుక అంటూ బాలయ్య థమన్ కు ఈ గిఫ్ట్ ఇచ్చే సందర్భంలో వ్యాఖ్యానించడం వారిద్దరి అనుబంధానికి సంకేతంగా భావించాలి. కొంతకాలం క్రితం నందమూరి థమన్ అని కామెంట్ చేసిన బాలయ్య, ఇప్పుడు థమన్ కు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య భవిష్యత్తు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య సినిమాలకు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలంటే అది థమన్ కి మాత్రమే సాధ్యం అనే స్థాయిలో ప్రజల్లో అభిప్రాయం నెలకొంది.
నందమూరి థమన్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరికొన్ని సంవత్సరాల పాటు బాలయ్య థమన్ కాంబినేషన్ కొనసాగే ఛాన్స్ ఉంది. దాదాపు అన్ని బాలయ్య సినిమాల్లో బీజీఎం విషయంలో ప్రశంసలు అందుకుంటున్న థమన్, బాలయ్య సినిమాల ద్వారా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. బాలయ్య అఖండ2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమా కూడా అద్భుత స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదని ఇప్పటికే థమన్ ప్రకటించారు. రాబోయే సినిమాకి కూడా స్పీకర్లు దద్దరిల్లడం పక్కా అని ఇప్పటికే థమన్ ప్రకటించేసారు కూడా.