పుష్ప సినిమాతో బాలీవుడ్ దాటి వెళ్ళిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఏ సినిమా చేస్తాడు అనేదానిపై ఎవరికి క్లారిటీ లేదు. పుష్ప 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేస్తాడని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమాపై ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు. జనవరిలో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఆ సినిమా ముందుకు వెళ్లడం లేదు. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని టాక్.
Also Read : రోహిత్ వారసుడిగా గిల్..? బోర్డు సంచలన నిర్ణయం..?
మరో సినిమాను అల్లు అర్జున్ సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నాడని ప్రచారం మొదలైంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఫైనల్ చేసినట్లు టాక్. పుష్ప 2 సినిమా షూటింగ్ టైంలోనే అల్లు అర్జున్ కు అట్లీ స్టోరీ వినిపించాడు. అప్పట్లోనే ఆ స్టోరీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉండటంతో, ఈ సినిమాను అల్లు అర్జున్ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.
Also Read : ఆరిన మెగా మంటలు.. ఆర్పేసిన బావ, బావమరిది…!
ఇక అట్లీ కూడా సల్మాన్ ఖాన్ తో చేయబోయే సినిమాను.. ఆల్మోస్ట్ పక్కన పెట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని కారణాలతో అట్లీ సినిమాను సల్మాన్ ఖాన్ చేయడం లేదు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండే ఆలోచనలో సల్మాన్ ఖాన్ ఉండటంతో అట్లీ ఇప్పుడు.. మరో హీరోతో సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని సమాచారం. ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయనున్నట్లు టాక్.




