ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఒక్కో అరెస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరిని అయినా అరెస్ట్ చేస్తామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తో హెచ్చరికలు పంపిన సిట్ అధికారులు, తాజాగా వరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్ వచ్చే నెలలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. పలువురిని ఇప్పటికే విచారించి ఆధారాలు సేకరించిన అధికారులు, వాటితోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!
ఇక ఈ కేసులో తీగల బ్రదర్స్ పై సిట్ నిఘా పెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో తీగల బ్రదర్స్ బండారం బట్టబయలు అయినట్టు సమాచారం. తీగల బ్రదర్స్ చిట్టా విప్పాడు ఏ40 వరుణ్ పురుషోత్తం. ఆ సమాచారం ఆధారంగా విచారణ మరింత వేగం పెరిగింది. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన ఏ40 వరుణ్ పురుషోత్తంను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసారు అధికారులు. ఏ1 రాజ్ కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలకంగా ఉన్న వరుణ్ ను కేసు నమోదు అయిన వెంటనే దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read : ఆ కేసుల్లో బెయిల్.. ఈ కేసుల్లో జైలు.. తురకా కిషోర్ ను వెంటాడుతున్న కేసులు
వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు.. ఇవాళ, రేపు హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న తీగల బ్రదర్స్ అసలు ఎక్కడ ఉన్నారు అనేది అర్ధం కాని పరిస్థితి. వాళ్ళను అరెస్ట్ చేసారా లేదా, అజ్ఞాతంలో ఉన్నారా అనేది సమాచారం తెలియలేదు. రాత్రి విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి సమక్షంలోనే సిట్ సోదాలు చేసింది. సోదాల తర్వాత ఇద్దరూ కనపడలేదు. రాత్రి మొదట వర్ధమాన్ కాలేజీలో సోదాలు జరిపిన సిట్.. విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలను విచారించింది. సుదీర్ఘ విచారణ తరువాత ఫాంహౌస్ లో డబ్బులు దాచిన ప్రాంతానికి తీగల బ్రదర్స్ ను తీసుకుని వెళ్ళారు. డోర్లు తెరిచి క్యాష్ డంప్ ను గుర్తించారు. పెట్టెల్లో దాచిపెట్టిన రూ.11 కోట్ల నగదును గుర్తించింది.