ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఒక్కో ట్విస్ట్ మైండ్ పోగొడుతోంది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో అర్థం కాక రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు వైసీపీలో కూడా ఈ విషయంలో ఆందోళన తీవ్రంగా ఉంది. ఎప్పుడు ఏ పేరు బయటకు వస్తుందో అని ఆ పార్టీ నాయకులతో పాటుగా కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఒక్క మూలం ఒక్కో పేరును బయటకు తీసుకొస్తుంది. విచారణ జరుపుతున్న కొద్ది కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తమను తాము పునీతులుగా చెప్పుకున్న వారు నిందితులుగా తేలుతున్నారు.
Also Read : చదరంగం కాదు రణరంగమని చెప్పుకున్న బిగ్ బాస్ – కానీ ఫలితం?
తాజాగా అనిల్ రెడ్డి అనే పేరు ఒకటి బయటకు వచ్చింది. ఈయన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు. ఈ తమ్ముడు గురించి పెద్దగా మీడియాలో ఎప్పుడూ ప్రచారం లేదు. కానీ లిక్కర్ కుంభకోణంలో ఈయనే కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దేశవ్యాప్తంగా లిక్కర్ కుంభకోణంలో సోదాలు జరిపింది. ఆ సోదాల ఉద్దేశం అనిల్ రెడ్డికి సంబంధించిన ఆధారాల కోసమే అంటున్నాయి పోలీస్ వర్గాలు. ఒకటి రెండు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు సైతం ఉన్నాయంటున్నాయి.
Also Read : చెర్రీ కొత్త బిజినెస్ ఏమిటో తెలుసా..?
ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే మాత్రం తర్వాత విచారణ నేరుగా జగన్ వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితులను అరెస్టు చేశారు. ఇప్పుడు నేరుగా కుటుంబ సభ్యులపై ఫోకస్ చేయడంతో ఏ అరెస్టులు ఉంటాయి అనేది హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉండవచ్చు అనే ప్రచారం సైతం జరుగుతుంది. సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించిన సమయంలో అనిల్ రెడ్డి పేరు బయటపెట్టినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అటు మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీకి తీసుకుని విచారిస్తోంది.