Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

ఏపీ కెబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపి కేబినెట్ సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలు ఒక్కసారి చూస్తే.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది కేబినెట్. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : దొరకని కసిరెడ్డి.. మళ్ళీ విజయసాయి రెడ్డికి షాక్

పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్ కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read : మళ్ళీ మొదలైన టీ కాంగ్రెస్ మంత్రి పదవి రచ్చ

30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులకు నవయుగ సంస్థకు రూ.93.93 కోట్లు చెల్లింపు ఆమోద ముద్ర వేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టును ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నెలకు రూ.60,000తో నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్