Tuesday, October 21, 2025 11:28 PM
Tuesday, October 21, 2025 11:28 PM
roots

జగన్ కోసం ఎందుకంత ఆత్రం..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు బతిమాలుతున్నారు.. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలనేది టీడీపీ నేతలు, అభిమానులతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పదే పదే చెబుతున్న మాట. వైఎస్ జగన్ సభకు రావాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని.. సభ్యత్వం రద్దుచేస్తామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వార్నింగ్ ఇస్తున్నారు కూడా. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. జగన్ సభకు రావాలని ఎందుకు ఇంతగా పట్టుబడుతున్నారు.. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read : విజయవాడ ఉత్సవ్.. ఖర్చు వంద కోట్లా..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని.. వైసీపీ సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు అవకాశం ఇస్తున్నామనేది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెబుతున్న మాట. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే ఇటీవల ఏ బహిరంగ వేదికపైన అయినా సరే.. సభ్యులంతా సభకు రావాలని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటున్నారు. లీవ్ అఫ్ అబ్సెన్స్ అడగకుండా 60 రోజుల పాటు సమావేశాలకు రాకపోతే శాసనసభ లేక పార్లమెంట్ సభ్యత్వాలకు అనర్హులంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయం 190(4)లో స్పష్టంగా ఉందని కూడా రూల్ బుక్ చూపించారు. అలాగే 187(2) రూల్స్ ఆఫ్ ప్రొసిజర్ అండ్ కాండాక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీలో కూడా ఉందన్నారు.

వాస్తవానికి సభ్యులు సభకు రావడం.. రాకపోవడం వాళ్ల ఇష్టం. రూల్స్‌కు విరుద్ధంగా సభకు రాకపోతే.. వారిపై చర్యలు తీసుకునే అధికారంలో సభాపతికి ఉంటుంది. 60 రోజుల పాటు సభకు సభ్యులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హాజరు కాకపోతే.. ముందుగా నోటిసు జారీ చేస్తారు. దానికి కూడా ఎలాంటి వివరణ ఇవ్వకపోతే.. అప్పుడు చర్యలు తీసుకుంటారు. కానీ జగన్ విషయంలో మాత్రం.. సభకు రావాలి.. రావాలి అని పదే పదే బతిమిలాడుతున్నట్లుగా ఉంది.

వాస్తవానికి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. సభకు రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. మాట్లాడినంత సేపు మైక్ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదా పైన ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఆయనపైన చర్యలు తీసుకుంటే.. హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఎలా చర్యలు తీసుకుంటారని మళ్లీ కోర్టుకు పోయే అవకాశం ఉంది. అంటే సభకు రాకూడదు అని జగన్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Also Read : అప్పులకుప్పగా మోడీ జమానా.. కాగ్ రిపోర్ట్ సంచలనం

జగన్ సభకు వస్తే.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తి చూపించాలనేది అధికార కూటమి సభ్యుల ప్లాన్. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా జగన్‌ను ప్రభుత్వ సభ్యులు ఇరుకున పెడుతుంటే.. చూడాలని ఆతృతతో ఉన్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. అందుకే ప్రతిసారి.. సందర్భం ఏదైనా సరే.. జగన్ సభకు రాకపోతే చర్యలు తీసుకుంటాం.. అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారు. మరి జగన్ సభకు వస్తారా.. రారా.. చూద్దాం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్