Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

రాజమౌళి – మహేష్ స్టోరీ లీక్ చేసిన ఆఫ్రికా మీడియా

రాజమౌళి సినిమా అంటే మీడియా హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా, ఏ సీక్రెట్ లీక్ అయినా సరే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా షేక్ షేక్ అవుతాయి. ఇప్పుడు జక్కన్న.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. అసలు ఫ్లాప్ అనే మాటే వినని జక్కన్న.. మహేష్ లాంటి కటౌట్ కు పాన్ ఇండియా హిట్.. కాదు కాదు పాన్ వరల్డ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి పాన్ ఇండియాను మించిన హిట్ లు చూసేసాడు.

Also Read : కల్వకుంట్ల కవిత గుస్సా.. ఎవరిపైన..?

ఇప్పుడు ఫోకస్ పాన్ వరల్డ్. మరి మహేష్ బాబుతో చేసే సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉండవచ్చు అనే ఆసక్తి మనకు ఎక్కువగా ఉంటుంది. మనకు ఉంటె తప్పులేదు.. మనవాడు కాబట్టి ఉంటుంది. కానీ ఆఫ్రికా దేశమైన టాంజానియాలో కూడా ఉంది జక్కన్న పిచ్చి. ఈ సినిమాలో కీలక సన్నివేశాల షూటింగ్ అక్కడే జరగాల్సి ఉంది. దీనితో అక్కడి ప్రముఖ మీడియా.. ది సిటిజెన్ ఓ న్యూస్ రాసేసింది. అదేమి సాదాసీదా న్యూస్ కాదు. సినిమా షూటింగ్ షెడ్యూల్ తో పాటుగా, సినిమా స్టోరీ కూడా రివీల్ చేసింది.

Also Read : అసలు.. వాళ్లిద్దరు ఎందుకు కలిశారు.. కారణాలేమిటీ..?

షూటింగ్ కోసం సినిమా యూనిట్ తమ దేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్తూ.. జూలై మూడవ వారంలో సెరెంగేటిలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్తుందని వెల్లడించింది. మహేష్ బాబు 29వ సినిమాను 116 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌ తో ప్లాన్ చేసారని పేర్కొంది. ఇక కథ గురించి చెప్తూ.. ఇండియానా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్‌ల నుండి స్ఫూర్తి పొందిన సినిమాగా చెప్పిన ది సిటిజెన్.. ఈ ప్రపంచాన్ని మార్చగల, చాన్నాళ్ళుగా కోల్పోయిన ఓ రహస్యాన్ని వెలికితీసేందుకు, ప్రకృతి, రహస్యం, శక్తివంతమైన ప్రత్యర్ధితో పోరాటం చేస్తూ అసలు, దిక్కులు తెలియని మార్గంలో ప్రయాణం చేస్తూ ఓ మిషన్ కు బయల్దేరే శక్తివంతమైన అడ్వెంచర్ ను చూపిస్తుందని రాసుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో పురాతన ఇతిహాసాలు, అడవి ప్రకృతి దృశ్యాలు వంటి ఎన్నో అద్భుతాలు ఉంటాయని తెలిపింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్