Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

అమీర్ ఖాన్ డేటింగ్‌లో ఉన్న అమ్మాయి ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో వివాహం చేసుకునేందుకు బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ రెడీ అవుతున్నాడు. కిరణ్ రావు తో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఒంటరిగా ఉండలేనని, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అమీర్ ఖాన్ ఇప్పుడు మాట నిలబెట్టుకున్నాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్క్రాట్ అనే అమ్మాయితో అతను డేటింగ్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ బయటపెట్టాడు. దాదాపు 18 నెలల నుంచి గౌరీ అనే అమ్మాయితో తాను డేటింగ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

Also Read : కార్తీక్ ఆర్యన్ తో శ్రీ లీల డేటింగ్ నిజమేనా..?

గౌరీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ రీటా కుమార్తె గౌరీ. ఈ కుటుంబానికి బెంగళూరులో ఒక ప్రముఖ సెలూన్ కూడా ఉంది. బ్లూ మౌంటెన్ అనే స్కూల్లో చదువుకున్న గౌరీ ప్రస్తుతం ముంబైలో కూడా ఒక సెలూన్ నిర్వహిస్తుంది. ఈ సెలూన్ కు బాలీవుడ్ ప్రముఖులు వస్తూ ఉంటారట. ఇప్పటికే ఆమెకు పెళ్లి కాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌరీ కొన్నాళ్లుగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో ఉద్యోగం కూడా చేస్తోంది. వీళ్ళిద్దరికీ 25 ఏళ్ల స్నేహం ఉన్నట్లు బాలీవుడ్ మీడియా రాస్కొచ్చింది.

Also Read : వర్మ తెలివి పోసానికి లేకుండా పోయిందే..!

ఇక గౌరీ ఎక్కువగా బెంగళూరులోనే ఉండటంతో ఆమెను కలవడం కోసం తానే అక్కడికి వెళ్తానని… అక్కడ మీడియా అటెన్షన్ తక్కువగా ఉంటుందని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆమె భద్రత విషయంలో అమీర్ ఖాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఆమె కోసం నలుగురు భద్రత సిబ్బందిని కూడా బెంగళూరులో ఏర్పాటు చేశాడు అమీర్ ఖాన్. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అనే దానిపై మాత్రం అమీర్ ఖాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక తన మాజీ భార్యలతో విడిపోయిన సరే వాళ్ళతో కలిసి సినిమాలకు వర్క్ చేస్తూ ఉంటాడు ఈ సీనియర్ హీరో.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్