గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు ఇచ్చిన షాక్ తో ఇబ్బంది పడుతున్న రాంచరణ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని పట్టుదలగా కనబడుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక బలమైన కారణం ఉంది.
Also Read : మిమ్మల్ని వదల.. సినిమా వాళ్ళను వెంటాడుతున్న ఐటీ
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్.. గేమ్ చేంజర్ సినిమాకు సైన్ చేస్తే ఎన్టీఆర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత దేవరా సినిమా పట్టాలెక్కింది. ఇక బుచ్చిబాబు సినిమాను దేవర సినిమా తర్వాత చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. ఇక బుచ్చిబాబు కూడా వేరే హీరోలకు కథ రాసుకొని రెడీగా ఉన్నాడు. ఇదే టైంలో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథను రామ్ చరణ్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఆ కథ పవర్ ఫుల్ గా ఉండటంతో ఎలాగైనా సరే తాను చేస్తానని ఎన్టీఆర్ ను స్వయంగా రామ్ చరణ్ ని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అప్పట్లో దీనికి సంబంధించి టైటిల్ కూడా ఒకటి అనౌన్స్ చేశారు. పెద్ది అనే టైటిల్ తో న్యూస్ వైరల్ అయింది. జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు.
Also Read : రామ్‌చరణ్ కెరీర్‌ను నాశనం చేసిన శంకర్
ఇక బుచ్చిబాబు.. రామ్ చరణ్ తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథనే రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు మెగా ఫాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఓ రకమైన యుద్ధమే జరుగుతుంది. వాస్తవానికి ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా రామ్ చరణ్ చేతిలో పడటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బుచ్చిబాబును బెదిరించి కథ లాక్కున్నాడు అంటూ రాంచరణ్ ను తిట్టిపోస్తున్నారు.